AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...............
మీకో ప్రశ్న

రామాయణ కాలంలో మంగళసూత్రం కట్టే ఆచారం ఉందా?
.........................

స్కూల్ నించి ఇంటికి వచ్చిన ఆశే్లష కాళ్లు, చేతులు కడుక్కుని టిఫిన్ తిని, పాలు తాగాక తల్లితో చెప్పి రామాయణం వినడానికి గుడికి బయలుదేరబోతూండగా ఆడుకోడానికి మిత్రుడు మురళి వచ్చాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాక మురళి కూడా ఆశే్లష వెంట రామాయణం వినడానికి గుడికి వెళ్లాడు. వాళ్లు వెళ్లిన ఐదు నిమిషాలకి హరిదాసు కథని ఆరంభించాడు.
‘మనం బాలకాండ చివరికి వచ్చేశాం. ఇవాళ డెబ్బై ఒకటి, డెబ్బై రెండు కాండలు చెప్తాను’
ఆయన మిరియాలు కలిపిన పాలని తాగి కథ చెప్పడం ఆరంభించాడు.
‘దశరథుడి వంశం గురించి వశిష్ఠుడు చెప్పాక విశ్వామిత్రుడు జనకుడి వంశం గురించి వారికి ఇలా చెప్పాడు.
‘మహామునీ! కన్యాదాన సమయంలో తమ వంశం గురించి చెప్పే సాంప్రదాయం ఉంది కాబట్టి విను. పూర్వం బలం గలవాడు, శ్రేష్ఠుడు, మూడు లోకాల్లో ప్రసిద్ధుడైన నిమి చక్రవర్తి ఉండేవాడు. నిమి కొడుకు, మొదటి జనకుడు మిథిలి, అతని కొడుకు ఉదావశుడు. అతనికి నందివర్థనుడు, అతనికి సుకేతువు, సుకేతువుకి రాజర్షి ఐన దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రధుడు, అతనికి మహావీరుడు, అతనికి సుధృతి కొడుకులుగా జన్మించారు. సుధృతికి ధృష్టకేతువు, రాజర్షి ఐన ధృష్టకేతువుకి హర్యశ్యుడు కొడుకులు. అతని కొడుకు మరుడు. మరుని కొడుకు ప్రతీంధకుడు. అతని కొడుకు కీర్తిరధుడు. అతనికి దేవమీఢుడు, అతనికి విబుధుడు, విబుధుడికి మహోద్రకుడు పుట్టారు. అతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, రాజర్షి మహారోముడికి స్వర్ణరోముడు, అతనికి రాజర్షి ఐన హ్రస్వరోముడు పుట్టారు. హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడిని నేను. నా తమ్ముడు కుశధ్వజుడు. మా నాన్నగారు రాజ్యభారాన్ని నాకు అప్పగించి వనానికి తపస్సుకి వెళ్లారు. తర్వాత ఆయన పోయారు. నా తమ్ముడ్ని చూసుకుంటూ ధర్మానుసారంగా రాజ్యపాలనని చేస్తున్నాను.
‘కొంతకాలం క్రితం సాంకాశ్యపురం రాజు సుధన్వుడు శివధనస్సుని, సీతని తనకి ఇవ్వమని కబురు పంపాడు. ఆ మాట వినకపోవడంతో మిథిలా నగరం మీదకి దండెత్తి వచ్చాడు. నేను నిరాకరించి యుద్ధంలో అతన్ని చంపాను. సాంకాశ్యపురానికి నా తమ్ముడ్ని రాజుని చేశాను. వశిష్ట మహామునీ! సీతని రాముడికి, నా రెండో కూతురు ఊర్మిళని లక్ష్మణుడికి ఆనందంగా ఇస్తానని చెప్తున్నాను. రామలక్ష్మణుల చేత పితృకార్యాన్ని చేయించు. తర్వాత పెళ్లి జరిపించు’
‘దశరథ మహారాజా! ఈ రోజు మఖ నక్షత్రం. ఇవాళ్టికి మూడో రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పెళ్లి చేద్దాం. రామలక్ష్మణుల చేత గోదానం, సువర్ణ దానం, భూదానం మొదలైన దానాలని చేయించు’ జనకుడు చెప్పాడు.
అది విన్న వశిష్ఠుడు, విశ్వామిత్రుడు జనకుడితో ఇలా చెప్పారు.
‘ఇక్ష్వాకు, విదేహ వంశాలు కొలతకి అందనంత గొప్పవి. ఈ రెండు వంశీయులతో సమానమైన వారు ఎవరూ లేరు. రామలక్ష్మణులకి సీత, ఊర్మిళలని ఇచ్చి పెళ్లి చేయడం రెండు వంశాల గౌరవాలకి తగినది’
ఆ ఇద్దరి మునుల సూచనని జనక మహారాజు సంతోషంగా అంగీకరించాడు.
‘సంతానానికి దేవత, దాత ఐన భృగుడు ఉత్తరా నక్షత్రంలో పెళ్లి శ్రేష్టం కాబట్టి కుశధ్వజుడి కూతుళ్లు మాండవి, శృతకీర్తిలకి కూడా రామలక్ష్మణులతో పాటు భరత శతృఘు్నలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేద్దాం. ముని పుంగవులైన మీ ఇద్దరూ సింహాసనాలని అధిష్టించి మా ముగ్గురి రాజ్యాల మీద అధికారం నిర్వహించండి. దశరథుడికి మిథిల మీద అధికారం ఉంది. అలాగే నాకూ అయోధ్య మీద అధికారం ఉంది. అందువల్ల దశరథుడి రాజ్యం మీద కూడా మీకు అధికారం ఇస్తున్నాను’ జనకుడు చెప్పాడు.
ఆ మాటలకి సంతోషించిన దశరథుడు చెప్పాడు.
‘మిథిలాధిపతులైన మీ ఇద్దరు అన్నదమ్ములు ఎందరో ఋషులని, రాజులని పూజించిన సద్గుణ రాశులు. మేము ఇక విడిదికి వెళ్లి పితృకర్మలని చేస్తాం’
జనక మహారాజు దగ్గర సెలవు తీసుకుని దశరథుడు వశిష్ఠ, విశ్వామిత్రులతో విడిదికి వెళ్లాడు.
శాస్త్ర ప్రకారం శ్రాద్ధం చేసి, మర్నాడు ఉదయం గోదానాన్ని చేశారు. దశరథ మహారాజు ఒక్కో కొడుక్కి కంచు పాత్రలతోపాటు పదివేలు చొప్పున బంగారు కొమ్ములు, లేగదూడలు గల నలభై వేల ఆవులని, భూమిని, బంగారు ఆభరణాలని, ఇతర వస్తువులని బ్రాహ్మణులకి దానం చేశాడు’
(బాలకాండ సర్గ 71, 72)
మురళి బయటకి వచ్చాక ఆశే్లషతో చెప్పాడు.
‘చక్కగా పద్యాలు పాడుతూ హరిదాసు కథంతా బాగా చెప్పాడు కాని ఆయన చెప్పిందాంట్లో ఏడు పొరపాట్లు ఉన్నాయి’
‘నీకెలా తెలుసు?’ ఆశే్లష అనుమానంగా అడిగాడు.
‘మీ బామ్మకి చాలాకాలం పిల్లలు లేకపోతే సంతానం కలగడానికి బాలకాండని పారాయణం చేసింది. మాకు లెక్కలేనన్నిసార్లు బాలకాండ చెప్పింది. అవేమిటో చెప్తాను విను’
ఆ ఏడు తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అనే మరో పేరు
ఎలా వచ్చింది?
ఆ వంశీకుడైన కకుత్సుడి కొడుకు రఘువు వల్ల రఘువంశం అనే పేరు వచ్చింది.

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.గౌతముడి కొడుకు, తన పురోహితుడైన శతానందుడితో ఇలా చెప్పాడు అని హరిదాసు చెప్పాడు. కాని ‘గౌతముడి కొడుకైన’ అని వాల్మీకి రామాయణంలో ఆ సందర్భంలో లేదు.
2.సరయూ నదీ తీరంలో కాదు. ఇక్షుమతీ నదీ తీరంలో.
3.కుశధ్వజుడి నగరం పేరు సాంకాశ్వ కాదు. అది సాంకాశ్య నగరం.
4.గరం (విషం)తో పాటు పుట్టిన అసితుడి కొడుక్కి సగరుడు (విషం కలవాడు) అనే పేరు పెట్టారు అని వాల్మీకి చెప్పాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
5.ఇక్ష్వాకు వంశంలోని ముప్పై ఆరవ మహారాజు దశరథుడు అన్నది తప్పు. ఆయన 37వ మహారాజు.
6.నాభాగుడికి అజుడు పుట్టాడు. నాభాగుడి కొడుకు పేరు హరిదాసు దాటేశాడు.
7.దశరథ మహారాజు ఇద్దరు కొడుకులు రామలక్ష్మణులు అని వంశవృక్షం చివర్లో వశిష్ఠుడు చెప్పాడు. హరిదాసు ఇదీ దాటేశాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి