జాతీయ వార్తలు
ఐసిస్ అంతుచూస్తాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒబామా స్పష్టీకరణ
కౌలాలంపూర్, నవంబర్ 22: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపునకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమతోపాటు తమ భాగస్వామ్య దేశాలేవీ వెనుకంజ వేయబోవని, ఐసిస్ అంతు చూస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో పాటు ఇటీవల వివిధ దేశాల్లో సామాన్య ప్రజలపై తీవ్రవాదులు జరిపిన దాడులను ప్రపంచం ఆమోదించబోదని ఆయన అన్నారు. తీవ్రవాద దాడుల మధ్యనే టర్కీ, ఆసియా దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటన ముగించుకున్న ఒబామా ఆదివారం వాషింగ్టన్‌కు బయలుదేరడానికి ముందు మలేషియాలో మాట్లాడుతూ ఈ విషయాలను స్పష్టం చేశారు. ‘తీవ్రవాదులు ఎన్ని భీకర దాడులకు తెగబడుతున్నప్పటికీ మనం ఏమాత్రం భయపడకపోవడమే మనకున్న బలమైన సాధనం’ అని ఆయన అన్నారు. ఇటీవల తీవ్రవాదులు రష్యా విమానాన్ని కూల్చివేసి 224 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని ఒబామా ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, ఉగ్రవాదంపై పోరాడుతున్న అమెరికా నేతృత్వంలోని కూటమితో చేతులు కలపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్, టర్కీ దేశాల్లో పర్యటించిన ఒబామా అక్కడ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా పుతిన్‌ను కలుసుకున్నారు. సిరియాలో రష్యా వైమానిక దాడులను ఉద్ధృతం చేసి ఆ దేశ అధ్యక్షుడు, రష్యాకు మిత్రుడు అయిన బషర్ అస్సద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులపై దృష్టి కేంద్రీకరించిందని, అయితే అసద్ అధికారంలో ఉన్నంత కాలం సిరియాలో హింసాకాండ ఆగదని ఒబామా అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రష్యా ‘వ్యూహాత్మక సర్దుబాటు’ చేసుకోవడం ద్వారా అసద్‌కు మద్దతును ఉపసంహరించుకోవాలని ఒబామా డిమాండ్ చేశారు.