ఓ చిన్నమాట!

సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పది సంవత్సరాల క్రిందటి మాట.
ఓ మిత్రుడు తన కవితా సంపుటిని ఆవిష్కరించడానికి కరీంనగర్ రమ్మని ఆహ్వానించాడు. సరేనని చెప్పాను. అతను ఆవిష్కరణ పెట్టుకున్నది ఉగాది రోజు సాయంత్రం.
ఉగాది రోజు రానే వచ్చింది. అప్పటికి ఎండలు ముదురు తున్నాయి. ఉదయం ఉగాది పచ్చడి తిని కరీంనగర్ వెళ్లటానికి బయల్దేరడానికి తయారవుతున్నాను.
మూడు గంటల ప్రయాణం. నా హడావిడి చూసి మా అమ్మ నా దగ్గరకొచ్చి ఇలా అంది.
‘పండుగ పూట. ఎండలు ముదిరాయి. ఇలాంటి మీటింగ్‌లకు ఎందుకు ఒప్పుకున్నావు’ అంది.
తల్లిగా ఆమె ఆలోచన నిజం. ఎండలు ముదిరాయి. పండుగ రోజు భార్యాపిల్లలతో ఉండకుండా ప్రయాణం చేయడం సమంజసమా అన్పించింది.
కవుల సమావేశానికి వెళితే అన్నీ మనమే. వాళ్లు కష్టపడి పుస్తకం ప్రచురించుకుంటారు. సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. కారుని వాళ్లు పంపించలేరు. అక్కడ రూంని కూడా ఏర్పాటు చేయలేరు.
స్వంత కార్లో వెళ్లాలి. అక్కడ వున్న మేజిస్ట్రేట్‌కి చెప్పి గెస్ట్‌హవుస్ ఏర్పాటు చేయించు కోవాలి. అన్నీ ఏర్పాటు చేసుకున్నాను.
ఎండలు భయపెట్టింది మాత్రం వాస్తవం. అమ్మ మాటలతో ఆలోచనల్లో పడ్డాను. కానీ వెళ్లక తప్పదు.
‘వస్తానని చెప్పానమ్మా! వెళ్లక తప్పదు’ అన్నాను.
‘వెళ్లుగానీ, ఏమి వస్తుంది’ అని అంది.
అప్పుడు ఆమెకు 88 సంవత్సరాలు ఉంటాయి. ఎక్కువగా చదువుకోలేదు.
నవ్వి మా అమ్మతో ఇలా అన్నాను-
‘ఏమీ రావమ్మా. మన డబ్బులే కొన్ని ఖర్చవుతాయి. కాకపోతే కాస్త సంతోషం వస్తుంది. అంతే! మనకు కావల్సింది సంతోషమే కదా!’ అన్నాను.
నా జవాబుతో మా అమ్మ సంతృప్తి చెందింది.
డ్రైవర్‌ని పిలిచి నా బ్యాగ్‌ను కార్లో పెట్టమని చెప్పింది.

- జింబో 94404 83001