ఓ చిన్నమాట!
పాస్వర్డ్ ( ఓ చిన్నమాట!)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ సాంకేతిక యుగంలో ఎన్నో సౌకర్యాలు. కంప్యూటర్ ఓ విప్లవమైతే, స్మార్ట్‌ఫోన్ మహా విప్లవం. కొత్తకొత్త పరికరాలు, పనిముట్లు అవతరించడంతో పాతవి ఎన్నో మాయమై పోతున్నాయి.
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఐపాడ్, స్మార్ట్‌ఫోన్ ఇట్లా ఎన్నో వస్తువులు ఇంట్లో వచ్చి చేరుతున్నాయి. మనుషులు దగ్గర ఉన్నట్టుగా అన్పిస్తుంది కానీ అంతులేని దూరాలు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త వస్తువులతో మనుషులతో సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఏ.టి.యం.లు వచ్చిన తరువాత సౌకర్యం పెరిగింది. కానీ బ్యాంక్ అధికారులతో సంబంధాలు తగ్గిపోయాయి.
ఇన్ని కొత్త వస్తువులతో ఓ కొత్త సమస్య వచ్చి పడింది. అన్నింటికి పాస్వర్డ్లు. ఈ పాస్ట్ వర్డ్లతోనే చిక్కు వచ్చి పడింది. మొబైల్ ఫోన్‌కి, ఐ పాడ్‌కి, కంప్యూటర్‌కి, ల్యాప్‌టాప్‌కి అన్నింటికి పాస్వర్డ్లు కావాలి. స్మార్ట్ఫోన్లలో కొత్తగా వచ్చిన వాట్సప్, టెలిగ్రామ్ లాంటి అప్లికేషన్లకి కూడా పాస్వర్డ్లు. ఇక్కడితో అయిపోలేదు. ఏటిఎంకి పాస్వర్డ్ (పిన్ నెంబర్) రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటే మరో రెండు మూడు పాస్వర్డ్లు.
రైల్వే టిక్కెట్లు, సినిమా టికెట్లు ఒకటేమిటీ ఇట్లా ఎన్నో ఇంట్లో కూర్చొనే కొనే అవకాశం ఏర్పడింది. వీటన్నింటికి కూడా పాస్‌వర్డ్‌లే కావాలి. ఏది కావాలన్నా ఇప్పుడు కావల్సింది పాస్‌వర్డే. ఈ మెయిల్ నుంచి ఇంటర్నెట్ దాకా పాస్‌వర్డే. ఈ పాస్-వర్డ్లతోనే చిక్కు సమస్య వచ్చి పడింది.
క్లిష్టమైన పాస్వర్డ్ తయారుచేసి పెట్టుకుంటే ఒక సమస్య. సులువైనది పెట్టుకుంటే మరో సమస్య. అన్నింటికి కలిపి ఒకే పాస్వర్డ్ పెట్టుకుంటే ఎన్నో సమస్యలు. ఒకదాని పాస్వర్డ్ మరో దానికి వాడినప్పుడు ఒక సమస్య. భార్య పేరు, పిల్లల పేర్లు పెట్టుకుంటే ఎన్నో సమస్యలు.
ఆధునిక పరికరాలతో సౌకర్యాలు పెరిగాయి. ఈ పాస్‌వర్డ్‌లతో సమస్యలు పెరిగాయి. హ్యాక్ చేయడానికి అవకాశం లేకుండా ఉండటానికని కొత్త పాస్వర్డ్లు సృష్టిస్తే అవసరమైనప్పుడు పాస్వర్డ్ గుర్తుకు రాక సమస్యలు పెరుగుతున్నాయి.
ఈ ఆధునిక పరికరాలతో, ఇన్ని రకాల పాస్‌వర్డ్‌లతో కొత్త తరం తమ జీవితాలని ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కాకుండా పోతోందని ఈ మధ్యన ఓ మిత్రుడు ఓ సమావేశంలో ఏకరువు పెట్టాడు. అయితే తనని మాత్రం ఈ పాస్వర్డ్లు బాధించడం లేదని తాను చాలా సంతోషంగా ఉన్నానని కూడా అతను చెప్పాడు.
ఆ సమావేశంలో వున్న కుర్రాడు లేచి మా మిత్రున్ని ఓ ప్రశ్న అడిగాడు. ‘మీరు సంతోషంగా ఉండటానికి అవసరమైన పాస్వర్డ్ ఏమిటి?’
మా మిత్రుడు చిన్నగా నవ్వి - నా సంతోషానికి పాస్వర్డ్ ‘సంతృప్తి’ అన్నాడు.
అందరూ అనుకోకుండా చప్పట్లు కొట్టారు.
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.