ఓ చిన్నమాట!

వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ వాకింగ్ చేయడం నా అలవాటు. పనుల ఒత్తిడి వల్ల మా ఆవిడ వాకింగ్‌కు రావడం కుదరలేదు. అందుకని ఓ సైకిల్ కొన్నాను. ఇది ఓ ఇరవై సంవత్సరాల క్రితం మాట. అవకాశం వున్నప్పుడు, అవకాశం చిక్కించుకొని సైక్లింగ్ చేస్తుందని నేను భావించాను.
ఓ రెండు నెలలు దాన్ని అప్పుడప్పుడూ ఉపయోగించి ఆ తరువాత దాన్ని ఉపయోగించడం మానేసింది. ఇంట్లో ఎవరూ ఆ సైకిల్ ఉపయోగించలేదు.
ఓసారి మా ఆవిడని అడిగాను - ‘సైకిల్ ఎందుకు ఉపయోగించడం లేద’ని. ఆవిడ చాలా కారణాలు చెప్పింది. అందులో ఒక కారణం - నడుం నొప్పి వస్తుందని. ఆ విధంగా సైకిల్ దానికి ఉద్దేశించిన పనిని చేయడం మానేసింది. కానీ దాన్ని మరో రకంగా ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. దాని మీద బట్టలు ఆరేయడం, టవల్ ఆరేయడం లాంటి పనులకు సైకిల్ ఉపయోగించడం మొదలైంది. ఆ విధంగానైనా అది ఉపయోగపడుతుందని మా ఆవిడ నవ్వుతూ అనేది.
ఆ మధ్య కరీంనగర్‌లో ఓ డాక్టర్ మిత్రుని దగ్గరకు వెళ్లాను. వాడు సైకిల్ కాకుండా ట్రెడ్‌మిల్ కొన్నాడు. వాడుతున్నాడు. నేనూ అలాంటిది కొందామని అన్పించింది. మా ఇంట్లోని సైకిల్ సంగతి గుర్తుకొచ్చి ఆ ఉద్దేశాన్ని మానుకున్నాను.
ఓ ఆరు నెలల తరువాత మళ్లీ మా డాక్టర్ మిత్రుని దగ్గరకు వెళ్లాను. అది కూడా బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడటం గమనించాను.
ఇది మా ఇద్దరి పరిస్థితి. చాలామంది ఇంటిలో ఇదే పరిస్థితి కన్పిస్తుంది. కారణాలు ఏవైనా దాని ఉద్దేశం వేరు. ఉపయోగించుకుంటున్న తీరు వేరు.
ఈ వస్తువులని ఉపయోగించుకుంటే అవి వాటి యజమానులని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాటిని మంచి ఉద్దేశంతో కొంటాం. కాని కాలక్రమంలో ఆ ఉద్దేశం వేరే విధంగా మారిపోతుంది.
ఎంత వృథా.
సైకిళ్లే కాదు. ఇలాంటి వస్తువులు ఎన్నో.
ప్రతి ఇంట్లోనూ ఇలాంటివి దర్శనం ఇస్తూ ఉంటాయి.
వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అవి ఎంతో ఉపయోగపడతాయి.
అవి తమకు తాముగా ఉపయోగించుకోలేవు. మనమే వాటిని ఉపయోగించాలి.
కానీ మనిషి వేరు. అతను తనకు తానుగా ఉపయోగించుకోగలడు.
మనిషి తనకు తాను ఉపయోగపడగలడు. ఇతరులకి ఉపయోగపడవచ్చు.
యంత్రాలకి మనిషికీ వున్న భేదం ఇదే.
మనం సైకిల్ మాదిరిగా, ట్రెడ్‌మిల్ గా ఉందామా? మనిషిలా వుందామా మన చేతిలో ఉంది.
మన శక్తిసామర్థ్యాలు వృథా కాకుండా చూసుకోవాల్సింది మనమే.

- జింబో 94404 83001