AADIVAVRAM - Others

నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఓ కాలేజీలో జరిగిన ‘కాన్వొకేషన్’ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా వెళ్లాను. కాన్వొకేషన్ని వాళ్లు ... తెలుగులో పేర్కొన్నారు. అది తెలుగు పదమా సంస్కృత పదమా భాషావేత్తలు తేల్చాలి. ఏమైనా ఓ పదాన్ని కాయిన్ చేసినందుకు నాకు ఆనందం కలిగించింది.
‘కాన్వొకేషన్’లో వేసే ‘ఆహార్యం’ ఇచ్చారు. అది వేసుకున్నాను. గతంలో ఎప్పుడూ వేసుకోలేదు. ఆ సభని చాలా క్రమశిక్షణతో నిర్వహించారు. ఓ ముప్పై మంది విద్యార్థులకి గోల్డ్‌మెడల్స్, మరో ముప్పై మంది విద్యార్థులకి ప్రశంసా పత్రాలు ఇచ్చాను. అక్కడంతా ఓ పండుగ వాతావరణం. ఆ పిల్లల్లో గొప్ప ఆనందం. వాళ్ల తల్లిదండ్రుల్లో ఒకింత గర్వం, మరెంతో సంతోషం.
సభ చివర్లో నేను మాట్లాడాలి. ఆ సభలో రెండు వేల మంది ఉంటారు. గుర్తింపు పొందింది వందలోపు. వాళ్లందరికి వర్తించే విధంగా మాట్లాడాలి. అందరికీ ఉత్తేజం కలిగే విధంగా మాట్లాడాలి. సభ జరుగుతున్నంత సేపు ఇదే ఆలోచించాను. ముందుగా నేను మాట్లాడాలని అనుకున్నది మాట్లాడాలని అన్పించలేదు. నా విషయం గుర్తుకొచ్చింది. అదే విషయం చెబుదామని అన్పించింది. వాళ్లతో మాట్లాడిన విషయాల్లో కొన్ని-
నేను నాలుగు డిగ్రీలు తీసుకున్నాను. కానీ ఎప్పుడూ కాన్వొకేషన్‌లో పాల్గొనలేదు. కనీసం మా పిల్లల గ్రాడ్యుయేషన్ ఫంక్షన్‌లో కూడా పాల్గొనలేదు. ఈ సభలో పాల్గొంటున్నందుకు ఒకింత ఉద్విగ్నంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది.
‘అత్యధిక మార్కులు సంపాదించి గోల్డ్‌మెడల్స్ ప్రశంసా పత్రాలు పొందిన విద్యార్థులకు అభినందనలు. వాళ్ల తల్లిదండ్రులకి, అధ్యాపకులకి నా శుభాకాంక్షలు. నేను సైన్సు నుంచి ‘లా’కి వచ్చాను. ‘లా’లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచి సైన్స్ డిగ్రీ వరకు ఎప్పుడూ నేను క్లాసులో కానీ కాలేజీలో కానీ ప్రథముడిగా రాలేదు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడిని కూడా కాలేదు. ‘లా’కి వచ్చిన తరువాతనే ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. ప్రథమ శ్రేణిలో పాస్ కాలేదని నేను ఎప్పుడూ బాధపడలేదు. ఆలోచించలేదు. కాలక్రమంలో నేను న్యాయమూర్తిని అయ్యాను. న్యాయమూర్తుల శిక్షణని ఇచ్చే జ్యుడీషియల్ అకాడెమీకి డైరెక్టర్‌గా పని చేశాను. హైదరాబాద్‌లో వున్న ప్రముఖ అకాడెమీల్లో రిసోర్స్ పర్సన్‌గా వెళ్తున్నాను. ‘లా’ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అలాంటి ‘లా’ని చెప్పాలంటే రోజూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏ కాలేజీలో చదివాను. నాకు ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి అన్న విషయం ఎవరికీ అవసరం లేదు. అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకి ఉపయోగపడే విషయాలు నేను చెబుతున్నానా అన్నదే ఇప్పుడు ప్రధానమైన విషయం. ఎప్పుడూ గోల్డ్‌మెడల్ సాధించని వ్యక్తి రాజ్యాంగ పదవి దాకా వెళ్లడం అనునిత్య అధ్యయనం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది.
ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వ్యక్తి మళ్లీ ఏదైనా పోటీలో పాల్గొంటే అతనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు. అందరిలాగే అతన్ని చూస్తారు.
జీవన ప్రయాణంలో మన నిర్వహణ (పెర్‌ఫార్మెన్స్)ని బట్టి విలువా గౌరవం లభిస్తాయి. అది నిరంతర సాధన వల్ల మన నిర్వహణా సామర్థ్యం పెరుగుతుంది.’