ఓ చిన్నమాట!
కొత్త సంవత్సరం ( కొన్ని పాత సంగతులు)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు వాళ్లకి రెండు కొత్త సంవత్సరాలు. ఆ మాటకొస్తే భారతీయులందరికీ రెండు కొత్త సంవత్సరాలు. జనవరి 1న మొదటిదైతే, మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే ఉగాది రెండవది. కొత్త సంవత్సరం రాగానే కొత్త ఊహలు, కొత్త నిర్ణయాలు మొదలవుతాయి.
ఈ రెండు కొత్త సంవత్సరాలకి భేదం ఉంది. మొదటి దాన్ని అర్ధరాత్రి జరుపుకుంటాం. రెండవదాన్ని ఉదయం నించి సాయంత్రం దాకా జరుపుకుంటాం. ఆంగ్ల సంవత్సరాన్ని దీపం ఆర్పి కేక్ కట్ చేసి జరుపుకొంటే తెలుగు సంవత్సరాన్ని దీపం వెలిగించి జరుపుకుంటాం. తీపికి తిండికి ఆంగ్ల సంవత్సరం రోజున ప్రాధాన్యం ఇస్తే, జీవితానికి దర్పణంగా షడ్రుచులకి ఉగాది రోజు ప్రాధాన్యం ఇస్తాం.
కొత్త సంవత్సరం రాగానే కొత్త ఊహలు, కొత్త నిర్ణయాలు మొదలవుతాయి. అంతేకానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోం. గడిచిన సంవత్సరంలోని నిర్ణయాలకు ఎంతవరకు అమలు చేశామన్న సంగతి పట్టించుకోం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది. ఎన్ని నిర్ణయాలు అమలు అయినాయి. ఎన్ని కాలేదో తెలుసుకునే వీలు కలుగుతుంది. ఎన్ని విలువైన రోజులని వృధా చేశామో తెలుసుకునే వీలు కలుగుతుంది.
కొత్త సంవత్సరంలోని మొదటి రోజు ఎంత ముఖ్యమో గత సంవత్సరంలోని చివరి రోజూ అంతే ముఖ్యం. కొత్త ఊహలు, కొత్త నిర్ణయాలు, కొత్త వాగ్దానాల గురించి మాత్రమే ఆలోచించకూడదు. గడిచిన సంవత్సరం తీసుకున్న నిర్ణయాల గురించి పునః పరిశీలన చేసుకోవాలి. గత సంవత్సరంలో ఏం నేర్చుకున్నామో పరిశీలించాలి. నేర్చుకోకపోవడానికి కారణాలను అనే్వషించాలి.
కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త విషయాలని, కొత్త సంగతులని నేర్చుకోకపోతే ఆ సంవత్సరాన్ని వృధా చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చదువుతో సంబంధం లేదు. వయస్సుతో సంబంధం లేదు. పదవీ విరమణతో సంబంధం లేదు. కొత్త విషయాలని నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి.
ఆధునిక యుగంలో వస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని కొంతమేరకైనా తెలుసుకోవాలి. కొత్త తరాన్ని అర్థం చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ విషయమే తీసుకుందాం. అది ఎలా వాడాలో తెలియక చాలా మంది ఇష్టపడరు. మాట్లాడుకోవడానికి మామూలు ఫోన్ చాలని అనుకుంటారు. స్మార్ట్‌ఫోన్‌ని ఆకళింపు చేసుకున్న తరువాత దాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే అది కంప్యూటర్‌లా పని చేస్తుంది. టేప్రికార్డర్లా, వీడియో రికార్డర్‌లా, కెమెరాలా ఇలా ఎన్నో విధాలుగా పని చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా కూడా పని చేస్తుంది. కొత్త పరిజ్ఞానాన్ని కొంతైనా నేర్చుకోవాలి. అప్పుడే మెయిల్స్ చూడగలం. ఫేస్‌టైంలో మాట్లాడగలం. ఇంతెందుకు వాట్సప్‌లో ఫొటోలు పంపగలం.
కొత్త సంవత్సరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. వాటి అమలుకి ప్రయత్నం చేయాలి.
ఈ అవకాశం సంవత్సరంలో మనకి రెండుసార్లు లభిస్తుంది. ఉపయోగించుకోకపోతే తప్పు మనదే!
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.