ఓ చిన్నమాట!

అంటువ్యాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో ఎవరైనా పొరపాటు చేసినప్పుడు పెద్దవాళ్లు కోప్పడతారు. అదే విధంగా ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో వాతావరణం వేడెక్కిపోతుంది. ఇలాంటి సమయాల్లో ఇల్లు వౌనం దాలుస్తుంది. అందరి మూడ్ కూడా అదోలా ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, ఆ ఇంటిలోని వ్యక్తి ఇంటిలోకి బయట నుంచి వచ్చినా ఆ విషయం తెలియకుండానే గమనిస్తాడు. అంటే ధ్వని తరంగాలు ఆ పరిస్థితిని తెలియజేస్తాయి.
మా చిన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కన్పించేది. ఎవరో ఏదో చిన్న తప్పు చేసేవారు. విసిగించేవారు. చదువుకోకుండా ఆటల్లో మునిగేవారు. ఇలాంటి పరిస్థితులు వున్నప్పుడు ఇంట్లో అడుగుపెడుతూనే ఆ వాతావరణ పరిస్థితి తెలిసేది. అప్పుడు పిల్లికూనల్లా ఎక్కడో వుండేవాళ్లం. వాతావరణం కాస్త తేరుకున్న తరువాత ఎప్పటిలా మారిపోయేవాళ్లం. ఈ పరిస్థితి అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది.
ఈ మూడ్స్ అనేవి అంటువ్యాధి లాంటివి. ఇంట్లో గంభీరమైన వాతావరణం వుంటే అదే వాతావరణం కొనసాగుతూ ఉంటుంది. ఇంట్లోని వ్యక్తులు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఇంటి పెద్ద మూడ్ ఇంటిని ప్రభావితం చేస్తుంది.
గంభీర వాతావరణాన్ని చిన్నపిల్లలు తేలిక పరుస్తారు. వాళ్ల మాటలతో, ఆటలతో. చిన్నపిల్లలు తేలికపరచనప్పుడు పెద్దవాళ్లే ఆ పని చేయాల్సి ఉంటుంది.
సంతోషం అనేది కూడా ఓ మూడ్. అది కూడా అంటువ్యాధి లాంటిదే. అందుకే మనచుట్టూ సంతోషంగా ఉండే వ్యక్తులు వుండే విధంగా చూసుకోవాలి. అంతే కాదు మనం కూడా కొంత సంతోషాన్ని వెదజల్లే విధంగా ఉండాలి. మన సంతోషాన్నీ, నవ్వుని ఇతరులకి పంచాలి.
ఈ ప్రపంచంలో సంతోషం మాత్రమే లేదు. దుఃఖం, బాధ, వేదన లాంటివి ఎన్నో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వున్న వ్యక్తులు ఎందరో మన మిత్రులు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. అలాంటి వ్యక్తుల బాధని సహవేదనతో వినాలి. దానివల్ల వాళ్లు ఊరట చెందుతారు. తేలిక పడతారు. దానివల్ల వాళ్లలో కూడా సంతోషం కొంత చిగురిస్తుంది.
ఒక వ్యక్తిని క్షమించడం వల్ల, ఆ వ్యక్తిని సంతోషపరిచిన వాళ్లమవుతాం. మనకు వ్యతిరేకంగా వున్న ఒక వ్యక్తి మనకు అనుకూలంగా మారతాడు.
సంతోషాన్ని పంచే బీజం కావాలి. ఈ అంటువ్యాధిని ప్రపంచవ్యాప్తం చేయాలి.

-జింబో 94404 83001