ఓ చిన్నమాట!

కాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనారోగ్యంగా వున్న వ్యక్తులని కలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనస్సు బాధగా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులని కలవడం చాలా తగ్గించాను. కానీ వాళ్లను కలవడం లేదన్న బాధ ఎక్కువగా ఉండేది.
మా నాలుగవ అక్క కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆమె దగ్గరకు వెళ్లడం చాలా తగ్గించాను. కీమో థెరపీ వల్ల వెంట్రుకలు కోల్పోవడం, మనిషి చిక్కిపోవడం వల్ల మా అక్కను చూడాలంటే చాలా బాధగా ఉండేది. ఆవిడ ఆరోగ్యం కాస్త కుదుట పడిన తరువాత మళ్లీ మా అక్కని కలవడం పెంచాను. మా రెండవ వదిన విషయంలోనూ ఇలాగే చేశాను. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకోవడం ప్రతిరోజూ చేసేవాడిని. అయినా ఇలా ప్రవర్తించడం సరైందేనా? అన్న ప్రశ్న తరచూ నన్ను వేధించేది.
ఈ పరిస్థితి ఇలా వుండగా మా గుణక్క (ఐదవ అక్క) చాలా వింతైన వ్యాధి బారిన పడింది. అది అల్జీమర్స్ కాదు. కానీ అలాంటి వ్యాధి అంటారు. హైదరాబాద్, బెంగళూరు డాక్టర్లు ఆమెను పరీక్షించారు. వైద్యం చేశారు. ఫలితం లేకుండా పోవడంతో ఆమె పరిస్థితి మరీ క్షీణించింది. ఆమె మాట కూడా పోయింది. ఇతరుల సాయంతోనే కాలకృత్యాలు తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది. మా గుణక్క విషయంలోనూ నేను అలాగే ప్రవర్తించాను. చాలా తక్కువగా ఆమెను కలవడం మొదలుపెట్టాను. మా ఇద్దరి బాల్యం ఒకేసారి గడిచింది. ఒకే స్కూలు. ఒకే స్నేహితులు. అయినా నా ప్రవర్తన నాకే వింతగా తోచేది.
నేను అమెరికా వెళ్లే ముందు మా గుణక్కని కలిశాను. ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం తెలుస్తూనే ఉంది. ఏం వైద్యం చెయ్యాలో తోచక డాక్టర్లు చేతులెత్తేశారు. ఆమెను హన్మకొండకి తీసుకొని వెళ్లారు. అమెరికా నుంచి వచ్చిన తరువాత హన్మకొండకి వెళ్లాను. గుణక్కని చూడటం అందులో ప్రధానమైన పని.
గుణక్కని కలిశాను. గుర్తు పడుతుందో లేదో అనుకున్నాను. నేను కలిసినప్పటి నుంచి ఒకటే నవ్వడం. నోటి నుంచి నవ్వు తప్ప ఎలాంటి మాట లేదు. చాలా కష్టం మీద నవ్వడం ఆపింది. ఆమె సహాయకురాలు ‘సార్‌ని గుర్తు పట్టినారా?’ అని అడిగింది. మళ్లీ నవ్వింది. ‘మీ తమ్ముడు కదా!’ అని మళ్లీ అడిగింది. మళ్లీ సంతోషంగా నవ్వింది. అంత కష్టంలో కూడా ఆమెకి కొంత సంతోషాన్ని ఇచ్చిన అనుభూతి కలిగింది. బాధ, సంతోషం కలగలిసిన ఫీలింగ్.
అక్కడున్న గంటసేపు అదే ఫీలింగ్. ఈ సమయంలో మా గుణక్కకి కావల్సింది అదే. గుణక్కకే కాదు. ఎవరికైనా కావల్సింది అదే. ఓ చిన్న నవ్వు. ఒకింత సంతోషం. దానికి మనం కారణం కావడంకన్నా గొప్ప పని మరేం ఉంటుంది?
మా నాలుగవ అక్కని, మా వదినని, మా గుణక్కని తరచూ కలవాలని నిర్ణయం తీసుకున్నాను. అదే నాలో కలిగిన మార్పు. అనారోగ్యంగా వున్న మిత్రులని, బంధువులని తరచూ కలవాలన్న కాంక్ష నాలో బలపడింది.

-జింబో 94404 83001