ఓ చిన్నమాట!

స్నూజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నిద్ర లేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ నిద్ర లేవరు. గతంలో అలారమ్ గడియారాలు వుండేవి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత చాలా వస్తువులు మూలన పడ్డాయి. అది రేడియో కావొచ్చు. టేప్‌రికార్డర్ కావొచ్చు. వీడియో రికార్డర్ కావొచ్చు. ఇలా ఎన్నో.. అందులో అలారమ్ పీస్ కూడా.
స్మార్ట్ఫోన్లలో కూడా అలారమ్‌లు వచ్చేశాయి. అవి మోగినప్పుడు వాటిని స్నూజ్ చేయవచ్చు. అలా చేయకపోయినా అవి మళ్లీ కాస్సేపటికి మ్రోగుతాయి. కచ్చితంగా లేవాలని అనుకుంటే అలారమ్‌తో పని లేకుండా నిద్ర లేవవచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాల్సిన పనిలేదు. కనీసం సూర్యోదయ సమయానికైనా నిద్ర లేవాలి. ముందుగా నిద్రలేస్తే ఒత్తిడి తగ్గుతుంది. అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ఇది అందరికీ తెలుసు. కానీ చాలామంది ఇలాగే చేస్తారు. స్నూజ్ చేస్తారు. ఆ తరువాత టైం సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఉదయం నిద్ర లేవడం అనేది క్రమశిక్షణలో అతి ముఖ్యమైన అంశం. అలారమ్ అవసరమే. ఎన్ని గంటలకు లేవాలన్నది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ సమయానికి నిద్ర లేవాల్సిందే. దాన్ని స్నూజ్ చేయడానికి వీల్లేదు.
జీవితంలో స్నూజ్ చేయాల్సిన అంశాలు వుండవు. కానీ చాలా విషయాలని స్నూజ్ చేస్తూ వుంటారు. వాయిదా వేస్తూ వుంటారు.
కోర్టులో మాదిరిగా పనులని వాయిదా వేయకూడదు.
వాయిదా వేయకుండా చేస్తూ పోవాల్సిందే.
నిద్ర లేవడాన్ని స్నూజ్ చేయకుండా క్రమశిక్షణని అలవర్చుకుంటే మిగతా విషయాల్లో కూడా క్రమశిక్షణ అలవడుతుంది.
ప్రతి రోజుని మన జీవితంలో అదే మొదటి రోజని భావించాలి.
ప్రతి రోజుని మన జీవితంలో చివరి రోజని అనుకోవాలి.
ఈ విషయం మన మనస్సులోకి ఎక్కితే ఉదయం లేవడానే్న కాదు. మరే విషయాన్ని కూడా స్నూజ్ చేయాల్సిన అవసరం ఉండదు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001