ఓ చిన్నమాట!
అనుకుంటాం గానీ...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనకు తెలియకుండా అన్నీ లభిస్తున్నప్పుడు వాటి విలువ మనకు తెలియదు.
ఈ మధ్య నాకు తీవ్రమైన గొంతు నొప్పి వచ్చింది. గొంతు తరచూ బాధ పెడుతోంది. గొంతు బాగా వుందని అనుకొని చల్లటి నీళ్లు త్రాగడమో, గొంతుకు పడని పళ్లని తినడమో జరుగుతుంది. అంతే!
ఓ వారం రోజులు గొంతు బాధిస్తుంది. మందులు, మాకులూ పడిన తరువాత మామూలు స్థితికి చేరుకుంటుంది.
ఓ కవి మిత్రుడు గొంతు గురించి ఇలా కవిత చెబుతాడు.
‘నా గొంతు పువ్వుకన్నా
కన్ను కన్నా సుకుమారం
ఒక్క మాటలో చెప్పాలంటే
నా గొంతు నాకన్నా సుకుమారం’
ఆ కవి గొంతు నా గొంతులాగే సుకుమారం. పులుపు పడదు. చల్లదనం పడదు. గట్టిగా మాట్లాడితే పడదు. ఏది జరిగినా గొంతు కుంచించుకు పోతుంది.
స్వరం మారుతుంది. మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా గొంతును సవరించుకోవాల్సిందే.
ఏది ముఖ్యం.
మన శరీరంలో ముఖ్యం కానిది ఏది?
ఈ సృష్టిలోనూ అంతే!
ఏది ముఖ్యం.
ఏది ముఖ్యం కాదు.
ఆ కవిత చివర ఇలా ముగిస్తాడు కవి. చాలా బాగుంటుంది ముగింపు.
‘ఒక్క గొంతే కాదు
ఏది లేకపోయినా కష్టమే!
అనుకుంటాం గానీ
అందంగా లేమని
అసలు అందం ఎందుకు
అన్ని అవయవాలు ఉండగా’
శరీరమే కాదు. ఈ సృష్టిలోనూ అంతే. అన్నీ ముఖ్యమే. ప్రతి దానికి దాని ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి మనిషీ అంతే! అనుకుంటాం గానీ.. అన్నీ ముఖ్యమే.