ఓ చిన్నమాట!
ఎల్బోయింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘రే పటి మనిషి’ అన్న కవితని చాలా రోజుల క్రితం రాశాను. ‘చూస్తుండగానే..’ అన్న కవితా సంపుటిలో ఆ కవిత వుంది. ఈ మధ్య తరచూ ఆ కవిత గుర్తుకొస్తోంది. అది గుర్తుకు రావడానికి కారణం - మనుషుల్లోని పరుగు. ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్లాలని పరుగు. ఆ పరుగులో మోచేతులతో ముందున్న వాళ్లని నెట్టివేయడం.Elbowing.. ఆ కవిత ఇలా మొధలవుతుంది.
‘ఇప్పుడు మనుషులకి మొఖాలు లేవు
అన్నీ మోచేతులే
ఒకరిని తోసేసి మరొకరు
ముందుకు పరుగెత్తాలి కదా!
Elbowing.
ఇఫ్పుడు మనుషులు మామూలుగా లేరు. ఒక్కటే పరుగు. ఒకరిని దాటి మరొకరు ముందుకెళ్లాలని పరుగు.
పరుగు అవసరమే. అయితే ఒక వ్యక్తిని ఎల్బోయింగ్ చేసి ముందుకు పరుగెత్తడం ఎంతవరకు సమంజసమో అర్థం కాదు.
ఉద్యోగంలో మనకన్నా ముందున్న వాడిని క్రిందకు త్రోసి ప్రమోషన్ పొందాలని పరుగు. ప్రతి విషయంలోనూ ఇదే పరిస్థితి. స్కూటర్ నడుపుతున్న వాడూ అంతే! నాలుగు చక్రాల వాహనం నడుపుతున్న వాడూ అంతే.
ఎల్బోయింగ్.
ముందున్న వాడిని త్రోసివేసి ముందుకు పరుగెత్తాలన్న ప్రయత్నం.
ఈ ప్రపంచమో నాకు మోచేయిగా కనిపిస్తుంది. మినహాయింపు వున్న వ్యక్తులు చాలా తక్కువ. మనిషి కూడా మోచేయిలా కన్పిస్తున్నాడు.
రేపటి మనిషి కవిత ఇలా ముగుస్తుంది.
అంతా పరుగే పరుగు.
ఈ పరుగెత్తే కాలంలో రేపటి మనిషికి బహుశా
మోచేతులు కూడా వుండవు.
ఇప్పుడు మనిషికి తల లేకుండా పోయింది. మోచేతులు మాత్రమే వున్నాయి. మోచేతులు కూడా లేకుండా పోయే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.