ఓ చిన్నమాట!
కితాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ మధ్య మా వేములవాడ కథలో భాగంగా ‘రథం పున్నమ’ అన్న కథ రాశాను. ఈ కథలన్నీ ఉత్తమ పురుషలో వుంటాయి. కథకుడితోబాటూ అతని స్నేహితుడు ఆ కథలో వుంటాడు. ఆ స్నేహితుడు అతని కజిన్.
ఆ ఇద్దరి చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న కథ అది. చిన్నతనంలో ఏదో ఆట ఆడి డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ల ఊరికి వెళ్లడానికి డబ్బులు కూడా వాళ్ల దగ్గర వుండవు. వాళ్ల అక్కయ్య ఇంటికి వెళ్లి డబ్బులు పోయిన విషయం చెప్పాలి. మళ్లీ డబ్బులు తీసుకుని వాళ్ల ఊరికి వెళ్లాలి. చివరికి ఇద్దరూ కూడబలుక్కుని ఓ కథని సృష్టించి వాళ్ల అక్కయ్య ఇంటికి తిరిగి వెళతారు. కథ చెబుతారు. వాళ్ల అక్కయ్య కథను నమ్మినట్టు నటిస్తుంది. కానీ నమ్మదు. తెల్లవారి చెరో రూపాయి ఇచ్చి ఓ మనిషిని ఇచ్చి బస్టాండుకి పంపిస్తుంది. ‘రథం పున్నమ’ జాతరలో ఏదో ఆట ఆడి డబ్బు పోగొట్టుకొని ఉంటారని ఆమె అనుకుంటుంది. కానీ వాళ్లని నిలదీయదు.
తెల్లవారి ఆ మనిషితోబాటూ ఇద్దరూ వాళ్ల ఊరికి వెళ్లిపోతారు.
వాళ్ళని నిలదీయక పోవడంవల్ల వాళ్లు ఇద్దరూ ఆనందపడతారు. కానీ వాళ్ల అక్కయ్య ఊరికి వెళ్లినప్పుడల్లా ఆ సంఘటన వాళ్లకి గుర్తుకొచ్చేది. కాలక్రమంలో ఆ విషయం మరిచిపోతారు.
అదీ యాభై సంవత్సరాల తరువాత ఆ సంఘటన ఓ కథగా రూపుదిద్దుకుంటుంది.
పత్రికలో ప్రచురితం అవుతుంది. అప్పటికీ వాళ్ల అక్కయ్య చనిపోతుంది. వాళ్లని బస్టాండ్‌కి వచ్చి బస్సు ఎక్కించిన మనిషి ఉంటాడు.
కథకుడు, కథకుని కజిన్ మాత్రమే వుంటారు. ఆ ఇద్దరిలో ఒకడు కథకుడు కావడం వల్ల ఆ సంఘటన బతుకుతుంది.
ఆ కథకుడి కజిన్‌ని ఆనంద ఆశ్చర్యాలలో ముంచివేస్తుంది ఆ కథ.
ఆ కథకుడిని నేను.
మా కజిన్ పేరు కూడా రాజేందరే.
రాజేందర్ ఇలా అంటాడు - ‘నువ్వు కథకుడివి కావడం వల్ల ఆ సంఘటనకి ప్రాణం పోశావు. ఎక్కడికో తీసుకొని వెళ్లావు. సృష్టికర్తలా మారావు’. కథకుడికి ఇంతకన్నా గొప్ప కితాబు ఏమి ఉంటుంది?