ఓ చిన్నమాట!
ఆత్మవిశ్వాసం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీవితం ఓ ప్రయాణం లాంటిది. ఎన్నో సందేహాలు భయాలు కలుగుతూనే ఉంటాయి. కూతురుకి వివాహం చేసినప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉంటారో అంతే ఆందోళనగా ఉంటారు. ఆ కూతురు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొత్త వాళ్లతో కొత్త ప్రదేశంలో ఎలా వుండాలోనన్న ఆలోచనలు ఆమెను వెంటాడుతాయి.
ఉద్యోగి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. బదిలీ అయినప్పుడల్లా అక్కడ కొత్త ఉద్యోగులతో ఎలా ఉండాలన్న ఆలోచనలు ఆ ఉద్యోగిని చుట్టుముడతాయి.
విమాన ప్రమాదం జరిగి విషయం తెలిసిన తరువాత, విమాన ప్రమాదం జరిగిన రెండు రోజుల తరువాత విమాన ప్రయాణం చేయాలంటే మనస్సు ఆందోళనగా ఉంటుంది. జీవితంలో ప్రతీ విషయమూ అంతే. కానీ అందరూ ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణగా రోడ్డు ప్రయాణాన్ని చెప్పుకోవచ్చు.
రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదు. ఉదయం దినపత్రిక చూడగానే మనకు కన్పించే వార్త రోడ్డు ప్రమాద వార్త. రోడ్లు వృద్ధి చేసినప్పటికి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అవుటర్ రింగ్‌రోడ్ లాంటి ప్రాంతాల్లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణాలు అనేకం. రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ మనలో చాలామంది ధైర్యంగా వాహనాలని నడిపిస్తూనే ఉన్నారు. అది ద్విచక్ర వాహనం కావొచ్చు. ఇంకా పెద్ద వాహనం కావొచ్చు. మోటారు వాహనంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఇంటి నుంచి తాను చేరాల్సిన ప్రాంతాన్ని క్షేమంగా చేరుకుంటానన్న విశ్వాసంతో బయలుదేరేవాడు. అనుకున్న సమయానికి తన గమ్యం చేరుకుంటానని అతను భావిస్తూ ఉంటాడు. దీనికి కారణం ఏమిటి?
అలా విశ్వాసంతో బయలుదేరిన వ్యక్తి ప్రమాదం పొంచిలేదా? ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు. అతనికి కూడా తెలుసు. అయినా అతను ఇంటి నుంచి విశ్వాసంతో బయలుదేరతాడు. అతను తన భయాలని, తన అపాయాన్ని గుప్త స్థానంలో ఉంచేసి ప్రయాణం కొనసాగిస్తాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గుప్త స్థానాన్ని తెరవడానికి అతను ఇష్టపడడు. తన డ్రైవింగ్ మీద, తన మీద అతనికి విశ్వాసం ఎక్కువ.
ప్రయాణంలో ఎన్నో వొడిదుడుకులు ఉంటాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అతివేగంతో వచ్చే వాహనాలు ఎన్నో కన్పిస్తాయి. గుంతలు లోయలు ఇట్లా ఎన్నో. వీటిని అధిగమిస్తూ ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది.
మన ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి. మరెన్నో ఉపద్రవాలు ఎదురవుతాయి. వీటిని ఎదుర్కొంటూ ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది.
మన మీద మనకి నమ్మకం ఉండాలి. భవగంతుడి మీద నమ్మకం ఉండాలి.
వాహన ప్రయాణమే కాదు. జీవిత ప్రయాణం కూడా ఇలాంటిదే. దేనికీ పూచీ ఉండదు.