ఓ చిన్నమాట!

వీడియో కెమెరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇంట్లో సామానుల కోసం ఓ అర(గది) ఉండేది. ఆ అరతో బాటు రెండు అటకలు ఉండేవి. ఆ అటకలపైన తరచూ ఉపయోగించని వస్తువులని పెట్టేవాళ్ళు. గంగాళాలు, జల్లి ఘంటలు, పెద్ద పెద్ద మూకుడులు, రైలు చెంబులూ, అండాలు వంటి వస్తువులని సామాన్ల గదిలో.. అట్లాగే అటకల మీద పెట్టేవాళ్ళు. ప్రతి సంవత్సరం వాటిని కిందకు దించి కలాయ పోయించి మళ్ళీ పైన పెట్టించేది మా అమ్మ. ఇది ఓ పెద్ద పనిలా ఉండేది.
ఇంట్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు, ఏవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు వీటి అవసరాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పటి మాదిరిగా మా చిన్నప్పుడు టెంట్ హౌస్‌లు లేవు. అందుకని సామాన్ల కోసం ఓ గది, అట్లాగే అటకల అవసరం ఏర్పడినాయి. పాత సామాన్లు కూడా వాటి మీద పెట్టేవాళ్ళు.
ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టెంట్ హౌస్‌లు వచ్చేశాయి. ఇల్లు చిన్నగా మారిపోయాయి. ఇండ్లల్లో వంటలు వండించే పరిస్థితి తగ్గిపోయింది. కేటరింగ్‌లు వచ్చేశాయి. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా బయటి నుంచే భోజనాలు వచ్చేస్తున్నాయి. హడావుడి తగ్గిపోయింది. దీనితో బాటు సామాన్ల గదులు అంతరించిపోయాయి. అటకలు, సజ్జలు కూడా తగ్గిపోయాయి. పెద్ద పెద్ద పాత్రలు, అండాలు, గంగాళాలు లేకుండా పోయినాయి. కానీ కొత్త కొత్త వస్తువులు చాలా వచ్చేశాయి. సీడీలు, డీవీడీలు, వీడియో కెమెరాలు, పెద్ద కెమెరాలు వంటివి ఎన్నో ఇళ్లల్లో వచ్చి చేరాయి. వాటికి సజ్జలు అవసరం లేదు. కానీ అల్మరాల్లో, వార్డ్‌రోబుల్లో అవి కొంత స్థానాన్ని ఆక్రమించి వేశాయి.
కాలం మారింది. పెన్‌డ్రైవ్‌లు, గూగుల్ డ్రైవ్‌లు వంటివి వచ్చిన తరువాత సీడీలు తన ఉనికిని కోల్పోయాయి. యూట్యూబ్‌లు, నెట్‌ఫ్లిక్స్‌లు వచ్చిన తరువాత డీవీడీలు తమ స్థానాన్ని కోల్పోయాయి. ల్యాప్‌టాప్‌లు వచ్చిన తరువాత డెస్క్‌టాప్‌ల అస్తిత్వం పూర్తిగా పోయింది.
స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ఎన్నో తమ ఉనికిని కోల్పోయాయి. అందులో ప్రముఖమైనవి కెమెరాలు, వీడియో కెమెరాలు.. కొంత మేరకు టీవీలు, ల్యాప్‌టాప్‌లు కూడా.. ప్రింటర్ అవసరం ఉన్నప్పుడే ల్యాప్‌టాప్‌లను వాడుతున్న వాళ్ళు ఎందరో..
చాలా డబ్బులు పెట్టి కొన్న వస్తువులు నిర్జీవంగా నిద్రిస్తున్నాయి. అందులోని బ్యాటరీలు కూడా పనికి రాకుండా పోతున్నాయి. ఏదైనా వాడకంలో లేకపోతే ఇలాగే తయారవుతాయి. మనుషుల తెలివి తేటలు, నైపుణ్యాలు కూడా అంతే..! వాటిని నిరంతరం వాడకపోతే, ఉపయోగించకపోతే అవి పనికి రాకుండా పోతాయి.
అందుకని మన శక్తిసామర్థ్యాలని సంపూర్ణంగా ఉపయోగిస్తూ ఉండాలి.
*

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001