ఓ చిన్నమాట!

కొత్త ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు వస్తూ ఉంటాయి.
కొన్ని గుర్తుంటాయి.
కొన్ని మర్చిపోతూ ఉంటాం.
రచయితలు, కవుల విషయంలో ఇలా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కవిత్వం రాయడానికి ఎక్కువ శ్రమ ఉండదు. నా ఉద్దేశంలో శారీరక శ్రమ, అదే కథలూ, నవలలూ రాసే రచయితలకి మానసిక శ్రమతో బాటూ, శారీరక శ్రమ కూడా ఉంటుంది. చాలా ఓపిక కావాలి.
అందుకని రచయితలు తమకు వచ్చిన ఊహను అక్షరబద్దం చేయడాన్ని వాయిదా వేస్తూంటారు. ఈ వాయిదా వేయడం వల్ల వచ్చిన ఆలోచన ఆవిరై పోయే అవకాశం ఉంది.
ఆలోచనలు, ఊహలు మనం మర్చిపోవచ్చు. కొన్ని మళ్లీ గుర్తుకు రావొచ్చు.
మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మన ఆలోచనలని ఊహలని ఓ చిన్న పుస్తకంలో రాసుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో అది కథగా రూపుదిద్దుకోవచ్చు.. నవలగా మారొచ్చు.
చాలామంది రచయితలు ఈ పనిని చేయరు. తమ జ్ఞాపకశక్తిని నమ్ముతారు. ఎంత జ్ఞాపకశక్తి ఉన్న వ్యక్తులకైనా కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు, కొత్త పనులు వచ్చి పాతవి మరుగున పడే అవకాశం ఉంది. మళ్లీ ఎప్పుడో ఆ ఆలోచన గుర్తుకు వస్తుంది. కొన్నిసార్లు గుర్తుకు రాకపోవచ్చు కూడా.
ఆలోచననీ, ఊహనీ ఓ చిన్న పుస్తకంలో రాసి పెట్టుకుంటే దాన్ని చూసినప్పుడు, అందులో మళ్లీ కొత్త ఆలోచనని నమోదు చేస్తున్నప్పుడు పాతవి గుర్తుకొస్తాయి. అందుకని ఆలోచనలని ఊహని నమోదు చేయడం అవసరం.
మొన్న ఓ గొప్ప ఊహ వచ్చింది. దాన్ని నమోదు చేసుకోలేదు. అది ఎంత గుర్తుకు చేసుకున్నా గుర్తుకు రావటంలేదు.
ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాలంటే మన జేబులో ఓ చిన్న డైరీ ఉండాలి. మన ఊహలని నమోదు చేసుకోవడానికి.
ఇది ఒక రచయితల విషయంలోనే కాదు
అందరి విషయంలోనూ వర్తిస్తుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001