ఓ చిన్నమాట!

ఐదు రూపాయల బిళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్న పనులు జరుగకపోతే విరక్తిగా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్టు వెలితిగా ఉంటుంది. ఇలాంటి స్థితి వున్నప్పుడు అలా బయటకు రావడం నా అలవాటు. కాస్సేపు రోడ్డు మీద అటూ ఇటూ నడిచి దగ్గర్లో వున్న సూపర్ మార్కెట్‌కి వెళ్తుంటే అక్కడ వున్న బిచ్చగాడు ధర్మం చేయమని విసిగించాడు. అసలే మూడ్ బాగాలేదు. అందులో బిచ్చగాడి విసుగు. అతన్ని కసురుకొని సూపర్ మార్కెట్‌కి వెళ్లాను. మూడ్ బాగా లేనప్పుడు రోడ్డు మీద నడవడం, అవసరం లేకున్నా షాపింగ్ చేయడం వల్ల మనస్సు తేలికపడుతుంది.
అది పేరుకు సూపర్ బజారే. కానీ అందులో హోటల్ ఉంది. ఐస్‌క్రీంలు అమ్మే షాపు కూడా ఉంది. ఓ ఏడేళ్ల కుర్రవాడు నా దృష్టిని ఆకర్షించాడు. అతను ఓ ఐస్‌క్రీం కొనుక్కున్నాడు. షాప్‌వాడు ఇచ్చిన ఐదు రూపాయల బిళ్ల తసీకొని బయటకు నడిచాడు. ఆ కుర్రవాడిని గమనిస్తూ నేనూ బయటకు వచ్చాను.
బయట వున్న బిచ్చగాడు నన్ను అడిగినట్టుగానే ఆ కుర్రవాడిని డబ్బులు అడిగాడు. ఆ కుర్రవాడు ఏమీ ఆలోచించకుండా ఆ ఐదు రూపాయల బిళ్ల అతడి చేతిలో వేసి ఐస్‌క్రీమ్ తింటూ వెళ్లిపోయాడు. అదే బిచ్చగాడు నన్ను డబ్బులు దానం చేయమని అడిగితే నేను విసుక్కున్నాను. నేనున్న పరిస్థితి కూడా కారణం కావచ్చు. ఆ కుర్రవాడు ఐదు రూపాయలు దానం చేయడం చూసిన తరువాత ఆశ్చర్యం వేసింది. అతని దయార్ద్ర హృదయం చూసిన తరువాత నా మనస్సు తేలిక పడింది. చుట్టూ వున్న వాతావరణం చాలా ప్రకాశవంతంగా కన్పించింది. కరుణతో వున్న ప్రపంచం అద్భుతంగా అన్పించింది. మనం ఏ మూడ్‌లో వున్నా ఎదుటి వాళ్లని విసుక్కోవడం అర్థరహితంగా అన్పించింది.
మనం ఇచ్చిన డబ్బు రూపాయా, ఐదు రూపాయల అన్న దానితో కూడా నిమిత్తం లేదు. తోచినంత దానం చెయ్యవచ్చు. విసుక్కోకుండా వుంటే ఇంకా మంచిది. ప్రేమపూర్వకంగా ఇచ్చిన దానికి విలువ లేదు. ఈ రోజుల్లో ఒక్క రూపాయి దానం తీసుకున్న వ్యక్తి కళ్లల్లో మెరుపు కన్పించడం లేదు. అయినా పర్వాలేదు. విసుక్కునే బదులు తోచింది ఇవ్వడం మంచిదన్పించింది. ఇవ్వకపోయినా కూడా పర్వాలేదని కూడా అన్పించింది.
ఐదు రూపాయల బిళ్ల దానం చేసి ఆ కుర్రవాడు ఈ ప్రపంచంలో దయా, కరుణా వున్నాయని మరోసారి రుజువు చేశాడు. ఈ సంఘటనని చూసిన వ్యక్తులు దయార్ద్ర హృదయులుగా వుండే విధంగా మార్చివేశాడు.
అయిదు రూపాయల బిళ్ల ఆ పిల్లవాడికి ఎక్కువ మొత్తం. నాకు చాలా తక్కువ మొత్తం. అప్పుడప్పుడు పసిపిల్లల్లా మారితేనే మంచిదని అన్పించింది.

-జింబో 94404 83001