ఓ చిన్నమాట!

అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం మనకి ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనం వాటిని సరిగ్గా వినియోగించుకోం. కొంత కాలం తరువాత అలా ఉపయోగించుకోనందుకు బాధపడతాం.
ఇది సహజం.
ఈ పరిస్థితి - స్థలాలు కొనే విషయంలో కావొచ్చు. ఉద్యోగ అనే్వషణలో కావొచ్చు. వివాహం విషయంలో కావొచ్చు.
ఐదు వందల రూపాయలకి గజం వున్న స్థలం కాలక్రమంలో యాభై వేలకి గజం కావొచ్చు. మనకు అవకాశం వుండి కొనలేకపోవచ్చు. ఇలా ఎన్నో ఉదాహరణలని చెప్పవచ్చు.
అయితే ఇక్కడొక విషయం మర్చిపోతాం. ఇప్పుడు కూడా ఐదువేలకి గజం వున్న స్థలాలు దూరంగా వుండవచ్చు. ఇప్పుడు వాటిని కొనుక్కోవచ్చు. భవిష్యత్తులో వాటి ధర పెరగవచ్చు.
ఉద్యోగానే్వషణలో వున్న వ్యక్తి గురించి చూద్దాం. నాకు తెలిసిన ఓ న్యాయవాద మిత్రుడు ఉన్నాడు. అతను మేజిస్ట్రేట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. కానీ సరిగ్గా చదవలేదు. అతనికి ఉద్యోగం రాలేదు. అతనికి రిజర్వేషన్ కూడా ఉంది. ఉద్యోగం పొందే అవకాశం వున్నా సరిగ్గా చదవక పోవడం వల్ల అతనికి ఉద్యోగం రాలేదు.
ఆ విషయం గురించి రెండు మూడు సంవత్సరాలు బాధపడ్డాడు. న్యాయవాదిగా అతనికి ఏడు సంవత్సరాలు గడిచాయి. నేరుగా జిల్లా జడ్జి ఉద్యోగం కోసం పరీక్ష రాసే అర్హత అతనికి వచ్చింది.
ఈసారి కష్టపడి చదివి పరీక్ష రాశాడు. అతనికి ఉద్యోగం వచ్చింది. మేజిస్ట్రేట్ ఉద్యోగం మిస్ అయినా అతనికి అంతకన్నా పెద్ద ఉద్యోగం జిల్లా జడ్జి వచ్చింది.
చాలామంది జీవితం కొనే్న అవకాశాలు ఉంటాయని, వస్తాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
ఒక అవకాశం పోతే మరో అవకాశం వస్తుంది.
జీవితంలో ఎన్నో అవకాశాలు.
జీవితం ఎన్నో అవకాశాలు ఇస్తుంది.
అట్లా అని వచ్చిన అవకాశాలని చేజార్చకూడదు.
అవకాశం మిస్ అయ్యిందని చింతిస్తూ కూర్చోకూడదు.
నిరంతర శ్రమ వుంటే అభివృద్ధి వుంటుంది.
ఒక్క ఉద్యోగ విషయంలోనే కాదు.
ప్రతి విషయానికి ఇది వర్తిస్తుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001