ఓ చిన్నమాట!

ఆశించడం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో గొప్పవాణ్ణి కావాలని చాలామంది ఆశిస్తారు. మరి కొంతమంది గొప్ప రాజకీయ నాయకుడు కావాలని, డాక్టర్ కావాలని, నటుడు కావాలని ఆశిస్తారు. ఇట్లా ఎన్నింటి గురించో కలలు కంటారు.
ఇది మంచిదే.
ఆశించడం, కలలు కనడం ఒక ఎతె్తైతే వాటిని సాఫల్యం చేసుకోవడం మరో ఎత్తు.
నాకూ కొన్ని కలలు వుండేవి. న్యాయమూర్తి కావాలని, మంచి రచయితలను కావాలని కోరిక వుండేది. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మేజిస్ట్రేట్ ఉద్యోగాల ప్రకటన వచ్చింది. సిన్సియర్‌గా పరీక్ష రాసి ఎంపికయ్యాను. ఆ తరువాత సీనియర్ సివిల్ జడ్జిగా, జిల్లా జడ్జిగా పని చేశాను. న్యాయమూర్తులకు శిక్షణని ఇచ్చే జ్యుడీషియల్ అకాడెమీలో సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్‌గా, డైరెక్టర్‌గా కూడా పని చేశాను. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా కూడా పని చేశాను. రచయితగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. ‘మా వేములవాడ కథలు’ రాసి మా వూరి మీద నా పాదముద్రని ఏర్పరిచాను.
ఆశించడం, కలలు కనడం ఒక ఎత్తు. ఆ దిశగా కృషి చేయడం మరో ఎత్తు. మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఆ విషయంలో మనకు నైపుణ్యం వుండాలి.
నిజమే!
అయితే - మనం పని మొదలుపెట్టిన తరువాతే మనకు నైపుణ్యం వస్తుంది. ఇది వాస్తవం. ఇది గుర్తించక చాలామంది తాము ఆశించిన గమ్యాన్ని చేరుకోవడంలో విఫలం అవుతుంటారు.
నువ్వు రచయితవి కాదల్చుకుంటే రాయడం మొదలుపెట్టు.
నాయకుడివి కాదల్చుకుంటే ప్రజలతో మమేకం అవ్వడం నేర్చుకో.
వ్యాపారం చేయదల్చుకుంటే వ్యాపారం మొదలుపెట్టు.
ఏది కావాలనుకున్నా ఆ దిశగా పనిని మొదలుపెట్టు.
ఎప్పుడో మొదలుపెట్టడం కాదు. ఈ రోజే మొదలుపెట్టు.
మొదట బెరుకు బెరుకుగా, కొత్తకొత్తగా వుండవచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ పనితనం మెరుగుపడుతుంది.
కొంతకాలం తరువాత అన్పిస్తుంది. కొంత ముందు మొదలుపెడితే బాగుండేదని. పరీక్షలప్పుడు మనకు తరచూ అన్పిస్తుంది. కొంచెం ముందుగా ఇంతే సీరియస్‌గా చదివితే ఎంత బాగుండేదని.
ఆశించడం ప్రక్కనపెట్టి ఆ దిశగా అడుగులు వేయడం వెంటనే ప్రారంభించాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001