ఓ చిన్నమాట!

అత్యున్నత స్థానం (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ప్రావీణ్యం ఉంటుంది.
అప్పటికే ఆ రంగంలో ప్రావీణ్యం పొందిన వ్యక్తులు లబ్దప్రతిష్టులైన వ్యక్తులు ఎందరో ఉండవచ్చు.
ఓ యువ చిత్రకారుడు ఉన్నాడనుకుందాం. అప్పటికే ఆయన రాష్ట్రంలో లబ్దప్రతిష్టులైన వైకుంఠం పి.టీ.రెడ్డిలు, కాపు రాజయ్యలు వుండవచ్చు.
ఓ క్రికెట్ ఆటగాడు వున్నాడనుకుందాం.
అప్పటికే అజరుద్దీన్ వుండవచ్చు.
ఓ కవికి - సినారె కన్పించవచ్చు. కాళోజీ కన్పించవచ్చు.
ప్రతి రంగంలోనూ ఎంతోమంది ప్రముఖులు ఉంటారు. అప్పటికే లబ్దప్రతిష్టులై ఉంటారు.
పర్వాలేదు.
ఎందరున్నా పర్వాలేదు.
ఎవరి స్థానం వారిదే!
మనం చాలామంది దృష్టిని ఆకర్షించకపోవచ్చు.
కానీ మన ప్రయత్నంలో ఆనందం ఉంటుంది.
అందుకని మన ప్రయత్నం మనం చేయాల్సిందే!
మన లక్ష్యం వైపు మన ప్రయాణం కొనసాగించాలి.
మన లక్ష్యాన్ని మనం చేరుకుంటామా లేదా నన్నది మరో విషయం.
కానీ
మన లక్ష్యం చేరుకోవడం కోసం మనం గట్టి ప్రయత్నం చేయాలి.
మనం ఎంచుకున్న రంగంలోని అత్యున్నత స్థానాన్ని చేరుకోలేకపోవచ్చు.
కానీ
ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మనం గట్టి ప్రయత్నం చేశామన్న సంతృప్తి మనకు మిగులుతుంది.
సంతోషం ఉంటుంది.
అంతకన్నా మనకు ఏం కావాలి?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001