ఓ చిన్నమాట!

తేనె తెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేనె తెట్టుని చూస్తే భయం వేస్తుంది.
కానీ
తేనెను చూస్తే తినాలనిపిస్తుంది.
తేనె తెట్టు నిండా తేనెటీగలు ఉంటాయి. తేనెను తీసుకొనే వ్యక్తిని తేనెటీగలు కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినా నేర్పుగా అతను తేనెను తీస్తాడు.
తేనెటీగలు కుట్టడంలోని బాధకన్నా తేనెను స్వీకరించడంలోని ఆనందమే వేరు.
ఏదో బాధ కలుగుతుందని ప్రయత్నం విరమించకూడదు.
తేనె తినడంలోని ఆనందమే వేరు.
తేనెటీలు కుట్టకుండా తేనెను పొందడం అంత సులువు కాదు.
తేనె తెట్టు అనేది ఒక ఉదాహరణ మాత్రమే.
ఏదైనా ఆటలో విజయం సాధించాలంటే అక్కడ కూడా ఓ ఆపద వుంది.
ఆ ఆటలో మనం గెలవవచ్చు.
లేదా
ఓడిపోవచ్చు.
విజయం సాధించాలంటే ఈ రిస్క్ తీసుకోక తప్పదు.
ఈ విషయం అన్ని రంగాలకు వర్తిస్తుంది.
ప్రతి విషయంలోనూ రిస్కు ఉంటుంది.
అది చదువు కావొచ్చు.
వ్యాపారం కావొచ్చు.
ప్రేమ కావొచ్చు.
ఏమైనా కావొచ్చు.
రిస్క్ ఉంటుంది.
అపజయం అన్న బాధా ఉంటుంది.
ఎన్ని వున్నా
ప్రయత్నం చేయడం మానకూడదు.

మంగారి రాజేందర్ ‘జింబో’94404 83001