ఓ చిన్నమాట!

ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో నాన్నని రకరకాలుగా పిలుస్తారు. కొంతమంది నాయన అంటారు. మరి కొంతమంది బాపు అంటారు. మా ఇంట్లో మా నాన్నని బాపు అని పిలిచేవాళ్లం. మా బాపు గురించి ‘మా వేములవాడ కథలు’ సిరీస్ ఓ కథ రాశాను. ఆయన గురించి అందులో చాలా చెప్పాను. అందరికీ తమ నాన్నల గురించి రకరకాల అనుభవాలు వుంటాయి. కొన్ని ఉత్తేజకరంగా కూడా వుంటాయి.
మా వేములవాడలో రాజరాజేశ్వర స్వామి గుడి వుంటుంది. అందులో అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అంటారు. ఏ శుభకార్యం జరిగినా అందరమూ వెళ్లేది ఆ గుడికే. ఆ గుడిలో ఎన్నో పూజలు వున్నాయి. అన్నపూజ, కోల్చాగ (ఎద్దు పిల్ల)ను దేవునికి సమర్పించడం, సేవ ఇట్లా ఎన్నో.
నా వివాహం అయిన మరునాడు గుడికి వెళ్లడానికి తయారవుతున్నాం. మా బాపు గుడికి వెళ్లిన సందర్భాలు నాకు గుర్తు లేవు. ఎప్పుడూ రోగులని చూడ్డం, వాళ్లకి మందులు ఇవ్వడం లాంటి పనులతో నిమగ్నమయ్యేవాడు. ఎవరు ఎంత ఇచ్చారన్న విషయంతో సంబంధం లేకుండా అతను చికిత్స చేసేవాడు. ఎవరినీ ఫీజు అడిగిన సందర్భం లేదు.
మేం గుడికి వెళ్లడానికి తయారవడం చూసి మా ఆవిడని పిలిచాడు.
‘శైలజా! ఈ సంచీ నిండా రూపాయి బిళ్లలు వున్నాయి. దేవుని గుడి ముందు చాలామంది బిచ్చగాళ్లు ఉంటారు. వాళ్లకి ఇవ్వు’ అన్నాడు.
అన్నపూజ చేయించమనో, కళ్యాణం చేయించమనో, కోడెను కట్టేయమనో, అమ్మవారికి కుంకుమ పూజ చేయించమనో చెబుతారని మా బంధువులు అనుకున్నారు. కానీ అలా కాకుండా చెప్పడం ఆశ్చర్యం వేసింది.
మా ఇంట్లో వాళ్లకి అలా ఏమీ అన్పించలేదు. మనుషుల సేవే మాధవ సేవ అనుకున్న మహా వ్యక్తి ఆయన అనుకున్నారు.
మా ఇద్దరి కళ్లు చెమర్చాయి ఆనందంతో.
ఓ గొప్ప బహుమానం ఇచ్చినట్టు ఫీలైపోయాం, ఇద్దరమూ.

మంగారి రాజేందర్ ‘జింబో’మంగారి రాజేందర్ ‘జింబో’94404 83001