ఓ చిన్నమాట!

మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా చిన్నప్పుడు పిల్లలకి జ్వరం వచ్చిందంటే మా అమ్మ చాలా ఆందోళన చెందేది. మా బాపు ఎంత చెప్పినా తన ధోరణి తనదే. మా బాపు మందులు ఇచ్చినా మా అమ్మకి తృప్తి ఉండేది కాదు. మమ్మల్ని ఉస్మాన్ బీబీ దగ్గరకు తీసుకెళ్లి మంత్రం వేయిస్తేనే ఆవిడకి తృప్తి కలిగేది.
మా వాడకట్టు చివర్లో వాగు దిక్కు వెళ్లేటప్పుడు కుడివైపు ఆమె ఇల్లుండేది. అప్పుడు ఆమె వయసు దాదాపు అరవై అయిదు దాటి ఉంటాయి. మనిషి తెల్లగా ఉండేది. ప్రేమపూర్వకంగా మాట్లాడేది.
మా మల్లయ్య మమ్మల్ని ఎత్తుకొని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్లేవాడు. మమ్మల్ని ఆమె దగ్గరికి తీసుకొని ఏదో మంత్రం చెదువుతూ ఆమె మా ముఖం మీద ఊదేది. ఓ మూడుసార్లు ఆ విధంగా ఊదిన తరువాత మమ్మల్ని ఇంటికి వెళ్లమని చెప్పేది. ఎలాంటి డబ్బులు తీసుకునేది కాదు. మా దగ్గరే కాదు. ఎవరి దగ్గర కూడా ఏమీ తీసుకునేది కాదు. కానీ మా అమ్మ అప్పుడప్పుడూ పాలూ, పెరుగూ, నెయ్యి ఆమెకు పంపించేది.
బాపు చనిపోయిన తరువాత మా అమ్మ హైదరాబాద్‌లో నా దగ్గరకు వచ్చేసింది. మా అబ్బాయికి కూడా ఓసారి జ్వరం వస్తే మా అమ్మ ఉస్మాన్ బీబీని తలుచుకుని, మా చిన్నప్పటి విషయాలను మా బాబుకి చెప్పేది. ఈ హైదరాబాద్‌లో ఉస్మాన్ బీబీ లాంటి వాళ్లు లేరని కూడా అనేది.
‘నానమ్మా నీ పిచ్చిగానీ వేసిన మంత్రానికి జ్వరం తగ్గిందని అనుకోవడం నీ పొరపాటు. తాతయ్య ఇచ్చిన మందువల్ల వాళ్ల జ్వరం తగ్గేది. అంతే!’
చివరికి ఓ రోజు మా అమ్మ మా బాబుతో ఇలా అంది.
‘మంత్రంలో ప్రకంపనాలు ఉంటాయి. ఆ ప్రకంపనాల నుంచి ధ్వని తరంగాలు ఆమె నుంచి మీకు ప్రవహిస్తాయి. దానివల్ల జ్వరం తగ్గేది. ఈ ప్రపంచమంతా ప్రకంపనాల మయమే. ఈ బిళ్లలోని అణువులో ప్రకంపనాలు ఉన్నాయి. మనిషి ప్రతి చర్యలోనూ ప్రకంపనాలు ఉన్నాయి.’
‘చాలు నానమ్మా! నువ్వు చదువుకోలేదు కదా అందుకే నీకేమీ తెలియదు’ అన్నాడు.
మా అమ్మ ఊరుకోలేదు.
‘ఒరేయ్ సన్నీ! మీ నాన్న కోపగించుకున్నప్పుడు ఇల్లంతా గంభీరంగా మారిపోతుంది కదా! నువ్వు బయటి నుంచి ఇంటికి రాగానే ఈ విషయాన్ని పసిగట్టి సైలెంట్‌గా ఉండే వాడివి ‘అవునా! కాదా’ అంటూ ఇంకా ఇలా అంది. ఈ గాల్లో ఎన్నో రకాల ప్రకంపనాలు ఉన్నాయో ఊహించగలవా? వాటిని స్వీకరించే పరికరం నీ దగ్గర ఉంటే వాటిని గ్రహించగలవు. మీ మొబైల్ ఫోన్ విషయమే చూడు. సంబంధిత నెంబరు వున్న ఫోన్ మన దగ్గర ఉంటే ఆ ప్రకంపనాలని మాటల రూపంలో మనం వినే అవకాశం ఉంది. అదే విధంగా ఓ వ్యక్తి కోసం మరో వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రకంపనాలు ఆ వ్యక్తికి చేరి స్వస్థత చేకూరుతుంది. ఉస్మాన్ బీబీ చేసింది అదే. ఆ శక్తి ఆమెకు ఉంది’
మా అమ్మ జవాబుతో ఆలోచనల్లో పడ్డాడు మా సన్నీ. మా బాబుతోపాటూ నేను కూడా ఆలోచనల్లో పడ్డాను.
మంత్రం ఉందో లేదో తెలియదు కానీ మంచి జరగాలని కోరుకుంటే ఆ ప్రకంపనాలు ఎదుటి వ్యక్తిని తాకి మంచి చేకూరే అవకాశం ఉందని అన్పించింది.

-జింబో 94404 83001