జాతీయ వార్తలు

నేడే నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆదివారం నేషనల్ ఎలిజబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) దేశవ్యాప్తంగా 52 నగరాల్లో జరగనుంది. ‘నీట్’ పరీక్షకు సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు శనివారం నిరాకరించడంతో ఆదివారం నాటి నీట్ పరీక్షకు మార్గం సుగమమైంది. నీట్‌కు సంబంధించి మరో బెంచ్ ఈ నెల 28న ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను అత్యవసరంగా వినడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది ‘ఈ లోగా ఏమీ అయిపోదు. ఈ వ్యవహారాన్ని ఒక బెంచ్ విచారించింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారం ముగిసింది. పరీక్ష నిర్వహించడానికి దయచేసి అనుమతించండి’ అని జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఎకె సిక్రీ, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్టస్థ్రాయి ప్రవేశ పరీక్షలకు ప్రిపేరయిన విద్యార్థులు ఇంత తక్కువ సమయంలో నీట్‌కు ప్రిపేర్ కావడం కష్టం గనుక నీట్‌పై జారీ చేసిన ఉత్తర్వులను సవరించాల్సిన అవసరముందని కొంతమంది విద్యార్థుల తరఫు న్యాయవాదులు కోరినప్పుడు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతానికి ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన బెంచ్ దీనికోసం ఒక దరఖాస్తును దాఖలు చేయాలని, ఈ కేసును విచారిస్తున్న రెగ్యులర్ బెంచ్ దాన్ని విచారిస్తుందని సంబంధిత న్యాయవాదులకు సూచించింది. నీట్‌కు సంబంధించి ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. 2016-17 విద్యాసంవత్సరానికి ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులకు అడ్మిషన్లు మే 1, జూలై 24 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించే నీట్ ద్వారా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్-2016)గా రూపుదిద్దుకున్న ఆల్ ఇండియా ప్రీ మెడికల్- ప్రీ డెంటల్ టెస్టు (ఎఐపిఎంటి) తొలి దశ పరీక్ష మే 1వ తేదీన దేశవ్యాప్తంగా 52 నగరాల్లో జరగనుంది. ఇందుకోసం సిబిఎస్‌ఇ అన్ని సన్నాహాలూ పూర్తి చేసింది. పరీక్ష ఉదయం 9.30కు ప్రారంభం కానున్నా, అభ్యర్ధులు ఉదయం 7.45 గంటలకే పరీక్ష కేంద్రాల్లో హాజరుకావల్సి ఉంటుంది. ఉదయం 7.45 నుండే రికార్డుల పరిశీలన, అభ్యర్ధి హాల్‌టిక్కెట్ పరిశీలన, ఒఎంఆర్ షీట్ అందజేయడం జరుగుతుంది. ఉదయం 9.30 తర్వాత ఏ అభ్యర్ధినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరు. పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. తొలి దశ నీట్‌లో దరఖాస్తు చేయలేకపోయిన అభ్యర్ధులకు మలి దశ నీట్ జూలై 24న నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వారం రోజుల్లో వెలువడనుంది. కాగా ఈ పరీక్ష రాసేందుకు ఆంధ్రా, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వారు అర్హులు కారు. అయితే ఈ రాష్ట్రాలకు చెందకపోయినా, ఈ రాష్ట్రాల్లో ఉంటూ చదువుకుంటున్న ఇతర రాష్ట్రాల వారు మాత్రం దరఖాస్తు చేసేందుకు అర్హులే. వీరంతా సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంచుకోవల్సి ఉంటుంది. రెండో దశ నీట్ నిర్వహణ సమయానికి మారే పరిస్థితులు అనుగుణంగా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. సిబిఎస్‌ఇ పిజి అడ్మిషన్లకు వేరుగా మరో పరీక్ష నిర్వహించనుంది.