జాతీయ వార్తలు

మళ్లీ మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపోర్, ఏప్రిల్ 27: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్, బిజెపి, సిపిఎం అరకొర సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వస్తుందని అన్నారు. శారదా చిట్స్ కుంభకోణాన్ని లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ధోరణి గురివిందను తలపించేదిగా ఉందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపిఏ హయాంలో 2జి స్పెక్ట్రమ్‌సహా అనేక కుంభకోణాలు వెల్లువెత్తాయని, వాటి గురించి నోరుమెదపని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శారదా చిట్స్‌పై నోరుపారేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆమె విరుచుకుపడ్డారు. 2జి స్పెక్ట్రమ్ నుంచి కోల్‌గేట్ వరకూ కాంగ్రెస్ పాలనంతా అవినీతిమయంగానే సాగిందని ఈ జాడ్యం అన్ని రంగాల్లోనూ వెర్రితలలు వేసిందని మమతా బెనర్జీ అన్నారు. ఇలాంటి అవినీతిమయమైన పార్టీకి తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించే హక్కు ఎంతమాత్రం లేదని వ్యాఖ్యానించారు. హుగ్లీ జిల్లాలో బుధవారం జరిగిన అనేక ఎన్నికల సభల్లో మాట్లాడిన మమత కాంగ్రెస్, సిపిఎం చేతులు కలపడంపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం లో అధికారంలో ఉన్నంతకాలం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రాష్ట్రాన్ని సందర్శించలేదని, ఇక్కడి పరిస్థితులు పట్టించుకోలేదని ఆరోపించిన మమత ‘ఎన్నికల సమయంలోనే వారికి పశ్చిమ బెంగాల్ గుర్తొస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా వలస పక్షులు వంటివే’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, సిపిఎం కూటమి రాష్ట్రంలో అధికారాన్ని ఆశిస్తున్నప్పటికీ కనీసం 20 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆమె అన్నారు.
తమకు 200 సీట్లకు పైగా వస్తాయంటున్న వామపక్ష పార్టీల అంచనాలను మమత ఎద్దేవా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర నుంచి రెండు సీట్లను గెలుచుకున్నప్పటికీ ఈ రెండేళ్ల కాలంలో బిజెపి కూడా చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు ఇంతవరకూ ఏమీ చేయని బిజెపి అసలు రాష్ట్రంలో అధివృద్ధే జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, బిజెపి, సిపిఎం పార్టీలకు చెందిన నేతలు అసలు రాష్ట్రానే్న పట్టించుకోలేదని ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బూటకపు వాగ్ధానాలు, తప్పుడు ఆరోపణలతో ప్రజలు మభ్యపెడుతున్నారని అన్నారు.