జాతీయ వార్తలు

అగస్టా అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై రాజ్యసభ బుధవారం భగ్గుమంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ముడుపులు ముట్టాయంటూ బిజెపి సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించడంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి గొడవకు దిగారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని కుంభకోణంలో ఇరికించేందుకు ఇటలీ ప్రధానితో రహస్య సమావేశం జరిపారని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆరోపించగా, ఆజాద్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్లర్ల కుంభకోణంపై చర్చ జరగకముందే ఆజాద్ కాంగ్రెస్ అధినాయకత్వం తరపున వివరణ ఇచ్చారని జైట్లీ ఎద్దేవా చేశారు. ఈ కుంభకోణంలో ముడుపులు చెల్లించినవారు శిక్ష అనుభవిస్తున్నారు కానీ ముడుపులు తీసుకున్నవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అరుణ్ జైట్లీ ఆరోపించారు. సోనియా గాంధీపై సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోకపోతే ఆయన మాట్లాడేందుకు అనుమతించమని కాంగ్రెస్ సభ్యులు తెగేసి చెప్పారు. స్వామి ఆరోపణలను రికార్డుల నుండి తొలగించాలని తెగేసి చెప్పటంతో ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ స్వామి ఆరోపణలను రికార్డుల నుండి తొలగించకతప్పలేదు. లోక్‌సభ సభ్యురాలైన సోనియా గాంధీపై రాజ్యసభలో ఆరోపణలు చేయటం ఏమిటి? సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ హెచ్చరించారు. దీనితో అధికార, ప్రతిపక్షం సభ్యుల మధ్య జరిగిన గొడవ మూలంగా రాజ్యసభ జీరో అవర్‌లో రెండుసార్లు వాయిదా పడింది. రాజ్యసభ ఈ రోజు ఉదయం సమావేశం కాగానే ఉపాధ్యక్షుడు కురియన్ ప్రభుత్వ పత్రాలను సభ ముందు ప్రతిపాదింపజేశారు.
మొదట గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై నిన్నటి నుండి వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాన మంత్రితో సమావేశమై వెస్ట్‌లాండ్ కుంభకోణంతో గాంధీ కుటుంబానికి ఉన్న సంబంధాలకు సమాచారం ఇస్తే మత్స్యకారులను చంపిన కేసులో ఉన్న ఇటలీ నావికులను వదిలివేస్తానని ప్రతిపాదించారంటూ ఒక ఆంగ్ల పత్రికలో వార్త వచ్చిందని ఆజాద్ చెప్పారు. ఇటలీ కోర్టు తీర్పు రాగానే ఇద్దరు నావికులను వదిలి వేశారని ఆజాద్ ఆరోపించారు. యుపిఏ ప్రభుత్వం వెస్ట్‌లాండ్ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెడితే ఎన్‌డిఏ ప్రభుత్వం దీనిని ‘మేక్ ఇన్ ఇండియా’లో పాల్గొనేందుకు ఎందుకు అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేస్తానంటూ మధ్యవర్తి జేమ్స్ మిచిల్ ఉత్తరం రాస్తే నరేంద్ర మోదీ ఎందుకు అంగీకరించటం లేదని ఆజాద్ నిలదీశారు.
సభా నాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, అరోపణలపై చర్చ జరగకముందే ఆజాద్ వివరణ ఇవ్వటం ఏమిటంటూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాన మంత్రిని కలిసి రహస్య చర్చలు జరిపినట్లు ఆజాద్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ సోనియా గాంధీ కుంభకోణంలో ప్రధాన పాత్ర నిర్వహించారంటూ మధ్య దళారి మిచెల్ రాసిన లేఖను ఇటలీ హైకోర్టు తమ రికార్డులో చేర్చిందని చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహంతో పోడియం వద్దకు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ సభ్యులు గొడవ చేయటంతో ఉపాధ్యక్షుడు కురియన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరును రికార్డుల నుండి తొలగించారు. సభ్యుల వాదోపవాదాల మధ్య సభ గందరగోళంలో పడి రెండుసార్లు వాయదా పడింది. చివరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఇతర అంశాల ప్రస్తావనకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చైర్మన్ హమీద్ అన్సారీ స్పష్టం చేయటంతో సభ సద్దుమణిగింది.

స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు