జాతీయ వార్తలు

న్యాయవ్యవస్థకు వెన్నుదన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించేందుకు పాత కోర్టులను ఆధునీకరించటంతోపాటు కొత్తగా మరో 79 కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ‘న్యాయమందించడంలో ఆలస్యం జరిగితే న్యాయం అందనట్లే’నన్న నానుడిని ఉటంకిస్తూ, ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో మాట్లాడారు. కోర్టుల్లో వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, న్యాయమూర్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. పెళ్లి సంబంధ వాజ్యాలు, చెక్కుల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అదనపుకోర్టులు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కుటుంబ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలపై దాడులకు సంబంధించిన కేసుల పరిష్కారానికి 13 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా మార్చినట్లు చెప్పారు. కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రాలు (ఏ.డి. ఆర్) ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర హైకోర్టుకు పూర్తి సహాయసహకారాలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందజేసేందుకు న్యాయ శాఖను తన వద్దే పెట్టుకున్నానని ఆయన చెప్పారు. ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆరు లక్షల కేసులను పరిష్కరించినందుకు రాష్ట్ర న్యాయాధికారులను అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. కోర్టుల్లో కేసులు పెరిగిపోవటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు సమాచార సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.
కాగా సమావేశానంతరం చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ సబార్డినేట్ కోర్టులో ఉన్న ఖాళీలను వీలున్నంత త్వరగా భర్తీ చేయటంతోపాటు మొదట పది శాతం ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠక్కర్ సూచించినట్లు తెలిపారు. పెండింగ్ కేసులను ఒక నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు.