జాతీయ వార్తలు

వైవాహిక ‘అత్యాచారం’ నేరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ ఏప్రిల్ 19: భార్య ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారానికి ఒడిగట్టడం(వైవాహిక అత్యాచారం) నేరంగా పరిగణించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ మంగళవారం తెలిపారు. వైవాహిక అత్యాచారం భారతీయ సామాజిక కోణంలో నేరంగా పరిగణించటం కుదరదంటూ నెల రోజుల క్రితం పార్లమెంట్‌లో మేనక చేసిన ప్రకటనపై దేశమంతటా దుమారం రేగిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇదే విషయమై ఆమెను విలేఖరులు ప్రశ్నించినప్పుడు, దీన్ని నేరంగా పరిగణించటంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. బేటీ బచావ్, బేటీ పడావ్(కూతుర్ని రక్షించు.. చదివించు) ప్రచార కార్యక్రమాన్ని దేశంలో మరో 61 జిల్లాల్లో ప్రారంభించిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. వైవాహిక అత్యాచారం అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిందని..త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని ఆమె వెల్లడించారు. మార్చిలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ‘ వైవాహిక అత్యాచారాన్ని అంతర్జాతీయంగా నేరంగా పరిగణిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల భారతదేశంలో అది సాధ్యపడదు. ఉదాహరణకు మన దేశంలోని సామాజిక ఆచారాలు, కట్టుబాట్లు, విలువలు, మత విశ్వాసాలు, వివాహాన్ని పవిత్ర బంధంగా చూసే సామాజిక మనోభావాలు, విద్య, అక్షరాస్యత, పేదరికం వంటి అన్ని అంశాల నేపథ్యంలో ఈ రకమైన చట్టం తీసుకురావటం వీలుపడదు’ అని అన్నారు. అయితే ఆ తరువాత దేశంలోని విభిన్న వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోందని ఆమె వెల్లడించారు.