జాతీయ వార్తలు

ఇషత్ కేసులో అఫిడవిట్‌ను ఎందుకు మార్చారో వెల్లడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఇషత్ జహాన్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బిజెపి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం ఉగ్రవాదులను ఉపేక్షించిందని, అందుకే ఈ కేసులో రెండవ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సోనియా గాంధీ అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరంను కోరారని బిజెపి అధికార ప్రతినిధి సాంబిత్ పట్రా నిప్పులు చెరిగారు. ఇషత్ జహాన్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కార్యకర్తఅని, అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని ఉందని పేర్కొంటూ దాఖలైన అఫిడవిట్‌ను మార్చాలని కోరిన ‘దోషి’ ఎవరో చిదంబరం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆదేశాలన్నీ ఒకే ఒక చిరునామా నుంచి వస్తుంటాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఆ చిరునామా ఏదో చిదంబరానికి బాగా తెలుసు. గత యుపిఎ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడిపింది ఆమే. కనుక ఇషత్ జహాన్ కేసులో కుట్రకు పాల్పడాలని కోరింది ఎవరో చిదంబరం బట్టబయలు చేయాలి’ అని సాంబిత్ పట్రా విలేఖర్ల సమావేశంలో అన్నారు. ఇషత్ జహాన్ ఉగ్రవాది అని, ఉగ్రవాదుల నుంచి నరేంద్ర మోదీకి ప్రాణహాని ఉందని పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)తో పాటు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్) అందజేసిన సమాచారాన్ని సోనియా, చిదంబరంతో పాటు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు.
‘ఈ సమాచారాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? అలా చేయాల్సిన అవసరమేమిటి?’ అని ఆయన ప్రశ్నిస్తూ, మోదీతో పాటు అమిత్ షాను సహించలేకనే కాంగ్రెస్ నాయకులు ఈ కుట్రకు పాల్పడ్డారని సాం బిత్ పట్రా ధ్వజమెత్తారు.

అన్నీ పరిష్కారం అవుతాయి

విభజన సమస్యలపై ఆందోళన వద్దు
ఇద్దరు సిఎంలూ చక్కగా పనిచేస్తున్నారు
ఢిల్లీ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యం లేదు
రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఒకదాని తరువాత ఒకటిగా అన్నీ పరిష్కారవౌతాయని.. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన ఆయన మంగళవారం ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఆ తరువాత విలేఖరులతో మాట్లాడుతూ, తన ఢిల్లీ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత లేదన్నారు. ‘ఇంతకుముందు ఫిబ్రవరి నెలలో వచ్చాను, ఇప్పుడు మూడు నెలల తర్వాత ఇక్కడికి వచ్చాను కాబట్టి అందరిని కలుస్తున్నాన’ని చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పని చేస్తున్నాయనీ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాయని, పరిపాలన ఇలాగే కొనసాగితే మంచి ఫలితాలు తప్పక వస్తాయని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పని చేస్తున్నారంటూ గవర్నర్ ప్రశంసించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఢిల్లీకి వచ్చినపుడు కలవమని గతంలో కోరడం వల్లనే ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన వివరించారు. విభజన మూలంగా ఉద్యోగులు ఏటువంటి ఆందోళనకు గురికావటం లేదనీ, చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజమేనని, వాటిని పెద్దవి చెయ్యవద్దని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, హోంమంత్రి రాజ్‌నాథ్, పీఏంఒ కార్యాలయ కార్యదర్శితో గవర్నర్ సమావేశం అయ్యారు.
భార్యకు పోచంపల్లి చీర
గవర్నర్ నరసింహన్ ఈరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా ఏపీ భవన్‌లోని ఆప్కో కేంద్రానికి వచ్చి తన భార్యకు ఒక పోచంపల్లి చీర కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మూడు రోజుల పర్యటన ముగించుకొని ఆయన మంగళవారం హైదరాబాద్ బయలుదేరారు.

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయన గవర్నర్ నరసింహన్