జాతీయ వార్తలు

కోహినూర్ వెనక్కితెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్‌కు బహుమతిగా ఇచ్చారని, దాన్ని వెనక్కి తెచ్చేదిలేదని సంకేతాలు అందించిన కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కితెచ్చే ప్రయత్నం చేస్తామని మంగళవారం పొద్దుపోయాక జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులు ఎత్తుకెళ్లలేదని, అలాగే బలవంతంగా తీసుకెళ్లలేదని నాటి పంజాబ్ పాలకులే దాన్ని ఈస్టిఇండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని సుప్రీం కోర్టులో సోమవారం వెల్లడించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. సిక్కుల యుద్ధంలో తమకు సహకరించినందుకు బహుమతిగానే 1849లో ఈస్టిండియా కంపెనీకి పంజాబ్ పాలకులు బహుమతిగా ఇచ్చారని సొలిసిటర్ జనరల్ సుప్రీంకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చే విషయంలో సుప్రీం కోర్టు ఇంత వరకూ తన వైఖరిని స్పష్టం చేయలేదని ప్రభుత్వం తెలిపింది. అయితే మీడియాలో మాత్రం ఇందుకు భిన్నమైన రీతిలో తప్పుడు అన్వయింపుతో కథనాలు వచ్చినట్టు పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు అన్నీకూడా ఎంతమాత్రం వాస్తవాలను ప్రతిబింబించేలాలేవని స్పష్టం చేసిన కేంద్రం 200 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాన్ని వెనక్కి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఉద్ఘాటించింది. అయితే ఈ ప్రయత్నాలు అన్నీకూడా సుహృద్భావ రీతిలోనే ఉంటాయన్న విషయన్నీ స్పష్టం చేసింది.