జాతీయ వార్తలు

బిజెపి ప్రభుత్వాల పని అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు ప్రజలకు అద్భుతమైన రీతిలో సేవలందిస్తున్నాయని, కష్టపడి పని చేస్తున్న ముఖ్యమంత్రులను చూసి పార్టీ గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘బిజెపి వ్యవస్థాపక దినోత్సవం నాడు పార్టీకోసం చెక్కు చెదరని ఉత్సాహం, అంకితభావంతో పని చేసిన కోట్లాది మంది కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నాను’ అని బుధవారం బిజెపి 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో మోదీ అన్నారు. కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి దాకా, కచ్‌నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ప్రజలు బిజెపిపై విశ్వాసం ఉంచారని, తమ కలలను సాకారం చేసే పార్టీగా దాన్ని చూస్తున్నారని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రతిచోటా అవి ప్రజలకు అద్భుతంగా సేవ చేస్తున్నాయని, రాష్ట్రాల్లో కష్టపడి పని చేస్తున్న ముఖ్యమంత్రులను చూసి పార్టీ గర్విస్తోందని మరో ట్వీట్‌లో మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో, సమాజానికి సేవ చేయడంలో తమ నిస్వార్థ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న బిజెపి కార్యకర్తలకు నా శుభాకాంక్షలు’ అని మోదీ ఆ ట్వీట్‌లో అన్నారు.
‘గుర్తింపును కాపాడుకుందాం’
జాతీయవాద పార్టీగా బిజెపికున్న గుర్తింపును మరింతగా ముందుకు తీసుకెళ్లాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎలాంటి ఉదాసీనత చూపవద్దని, రాబోయే పాతికేళ్లలో పంచాయతీనుంచి పార్లమెంటు దాకా పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. బిజెపి 36వ వ్యవస్థాక దినోత్సవం సందర్భంగా బుధవారం అమిత్ షా ఇక్కడ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, జాతీయ వాద పార్టీగా బిజెపికి ఒక గుర్తింపు ఉందని, ఈ గుర్తింపును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. బిజెపి ఇప్పుడు ఈ స్థితికి చేరుకోవడానికి ఆ గుర్తింపును, భారత మాతను కాపాడడానికి మూడు తరాల కార్యకర్తలు చేసిన త్యాగాలే కారణమని ఆయన అంటూ, ఈ త్యాగాలు వృథా కానివ్వరాదన్నారు.

కాగా, ‘్భరత్ మాతాకీ జై’ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్ షా అదే నిదాంతో ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

మద్యంపై నిషేధం హక్కుల ఉల్లంఘనే!

బిహార్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పాట్నా హైకోర్టులో పిల్

పాట్నా, ఏప్రిల్ 6: బిహార్‌లో మద్యం అమ్మకాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో బుధవారం ఒక ప్రజా ప్రయోజనాల పిటిషన్ దాఖలయింది. నితీశ్ కుమార్ మంత్రివర్గం మంగళవారం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించగా, మరుసటి రోజే ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎఎన్ సింగ్ అనే మాజీ సైనికోద్యోగి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఏం తినాలి, ఏం తాగాలి అనే పౌరుల మానవ హక్కులను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అణచివేయడమే అవుతుందని పిటిషనర్ తన పిల్‌లో వాదించారు. ఈ పిల్ విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌సహా అన్ని రకాల మద్యంపై నిషేధం విధిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశీయ, విదేశీ మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధాన్ని విధించారు. అయితే పట్టణాలు, నగరాలలో ఐఎంఎఫ్‌ఎల్‌కు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. నాలుగు రోజుల స్వల్ప కాలంలోనే మద్యానికి వ్యతిరేకంగా పాట్నా సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి ముఖ్యంగా మహిళలు, పిల్లల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించినట్లు నితీశ్ కుమార్ ప్రకటించారు.

ఆర్మీకి చెందిన కంటోనె్మంట్ ప్రాంతాలను మద్య నిషేధం నుంచి మినహాయించారు.

వేధింపులే కారణం!

ప్రత్యూష ఆత్మహత్యపై తల్లిదండ్రులు తప్పుకున్న రాహుల్ తరపు న్యాయవాది

ముంబయి, ఏప్రిల్ 6: ‘బాలికా వధు’ సీరియల్‌లో ఆనంది పాత్రలో నటించడం ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. తమ కుమార్తె ప్రత్యూష బెనర్జీ ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు బుధవారం ఆరోపించారు. ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు, టివి ప్రొడ్యూసర్ రాహుల్ రాజ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న అతనిపై పోలీసులు ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగంపై కేసు నమోదు చేశారు. మరోవైపు, రాహుల్ రాజ్ సింగ్ తరపు న్యాయవాది నీరజ్ గుప్తా ఈ కేసును వాదించే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ‘మానవతా దృక్పథంతో ఈ కేసును వాదించే బాధ్యతల నుంచి తప్పుకున్నాను. ఎవరికీ అన్యాయం జరుగకూడదనే ఉద్దేశంతోనే ఈ కేసులో వాదించే బాధ్యతల నుంచి తప్పుకున్నాను’ అని నీరజ్ గుప్తా బుధవారం ఇక్కడ ఒక వార్తాసంస్థకు చెప్పారు. ‘ఒప్పు కాని తప్పు కాని, మంచి కాని చెడు కాని ఏమి జరిగినా క్లయింట్ తన న్యాయవాదికి చెప్పి తీరాలి. కాని నాకు పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని నేను బయటి నుంచి తెలుసుకున్నాను’ అని గుప్తా వివరించారు.
రాహుల్ వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, అందువల్ల అతన్ని వదలిపెట్టకూడదని ప్రత్యూష తల్లి సోమ డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరడానికి నిర్వహించిన ఒక ప్రార్థనా సమావేశానంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ‘నా కుమార్తెకు న్యాయం జరగాలి. నా కుమార్తెకు న్యాయంకోసం పోరాడుతున్న నాకు సహకరించాల్సిందిగా నేను జాతి యావత్తునూ కోరుతున్నాను. అతను నా కుమార్తెను తీవ్రంగా వేధించి, ఆత్మహత్య చేసుకునేలా చేశాడు’ అని అన్నారు. ఎలాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారని ప్రశ్నించగా, ‘అతన్ని జీవించి ఉన్నంతవరకు జైల్లో పెట్టాలి. జీవితాంతం అతను బాధపడాలి’ అని ఆమె బదులిచ్చారు. ప్రత్యూష అంత్యక్రియలు పూర్తికానందున ఇప్పటివరకు తాము బయటకు రాలేదని, ఆ కార్యక్రమాలను పూర్తిచేసిన తరువాత ఈ రోజు రాహుల్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రత్యూష తండ్రి శంకర్ బెనర్జీ విలేఖరులకు చెప్పారు. ‘రాహుల్‌కు ఉరిశిక్ష విధిస్తారా, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారా అనేది కాదు. అతన్ని శిక్షించకుంటే మా కుమార్తె ఆత్మ శాంతించదు. మేము చట్టాన్ని విశ్వసిస్తాం. నిజం బయటకు వస్తుందనే విశ్వాసం మాకుంది’ అని అన్నారు. ప్రత్యూష తల్లి సోమ బంగూర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్‌పై ఐపిసిలోని 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 504, 506 (నేరపూరిత కుట్ర), 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.