జాతీయ వార్తలు

మా ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిశ్వనాథ్ చరియాలి (అసోం), మార్చి 30; కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ కూల్చి వేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.‘ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికయిన ప్రభుత్వాలను కూల్చివేయడానికి వారు అన్ని రకాల ప్రయత్నించారు. కాంగ్రెస్ పాలిస్తున్న అన్ని రాష్ట్రాల్లోను అదే పని చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు’ అని సోనియా గాంధీ బుధవారం ఇక్కడొక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ సోనియా అన్నారు. అవకాశం ఉంటే వారు అసోంలో కూడా అదే పని చేసి ఉండేవారు, ఇక్కడి ప్రభుత్వాన్ని కూడా కూల్చి ఉండేవారు. వాళ్లు ప్రజా వ్యతిరేకులే కాదు, అసోం వ్యతిరేకులు కూడా’ అని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకమైన తీరులో పాలిస్తోందని ఆరోపిస్తూ సోనియా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రజాస్వామిక వ్యవస్థపై నమ్మకం లేదని సోనియా అన్నారు.
కాగా, అంతకు ముందు శివసాగర్, అంగురిలలో జరిగిన ఎన్నికల సభల్లో బిజెపి నేతృత్వంలోని కూటమిని మతతత్వ శక్తులు, విచ్ఛిన్నకర శక్తుల కలయికగా అభివర్ణించిన సోనియా ప్రధాని నరేంద్ర మోదీ అసోం ప్రజలను అవమానిస్తున్నారని, అభివృద్ధికి సంబంధించిన హామీలపై మాట తప్పుతున్నారని ఆరోపించారు. అసోం టీతో టీ అమ్మేవాడిగా తాను జీవితం ప్రారంభించానని మోదీ చెప్పుకోవడాన్ని సైతం సోనియా ఎద్దేవా చేస్తూ, ‘మాకు అచ్ఛే దిన్ (మంచి రోజులు) ఎప్పుడు వస్తాయని తేయాకు తోటల్లో పని చేసేవారు, గిరిజనులు అడుగుతున్నారు’ అని అన్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ‘అచ్ఛేదిన్’ అనేది మోదీ ఎన్నికల నినాదం అన్న విషయం తెలిసిందే. బిజెపి అసోం ప్రజలను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానిస్తున్నదని సోనియా పదేపదే ఆరోపిస్తూ, ‘ఈసారి అసోం సంస్కృతి ప్రమాదంలో పడింది, ఎందుకంటే ఇక్కడ రెండు ప్రమాదకర శక్తులు ఒకటైనాయి. వాటిలో ఒకటి మతతత్వ శక్తి అయితే రెండవది విచ్ఛిన్నకర శక్తి’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నారు. ఈ రెండు శక్తులను తిప్పికొట్టగల శక్తి కాంగ్రెస్ ఒక్కటేనని ఆమె అంటూ, అందుకే వాళ్లు కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నారన్నారు. బిజెపి మిత్రపక్షమైన ఎజిపి గతంలో రెండు సార్లు రాష్ట్రాన్ని పాలించిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం అసోం పట్ల వివక్ష చూపిస్తోందని సోనియా ఆరోపిస్తూ, ‘ఈశాన్య రాష్ట్రాల, అసోంలోని సోదర సోదరీ మణులను ఎందుకంతగా అవమానిస్తున్నారు. తరుణ్ గొగోయ్‌ని ఇంతగా ఎందుకు అవమానిస్తున్నారు? అసోం ప్రజలను ఎందుకు అవమానిస్తున్నారు? అని ప్రశ్నించారు. బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రధాని మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలను బిహార్‌కు అవమానంగా చూపించి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరహాలోనే సోనియా కూడా అసోంను, అసోం ప్రజలను, తరుణ్ గొగోయ్‌ని అవమానిస్తున్నారంటూ అదే వ్యూహానే్న అనుసరిస్తుండడం గమనార్హం.