జాతీయ వార్తలు

పాకిస్తాన్ ఒప్పుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థోవ్రా/ మోరాన్ (అసోం), మార్చి 30: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడి కుట్ర మూలాలు తమ దేశంలోనే ఉన్నాయన్న విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడిక్కడ వెల్లడించారు. కొంతకాలంగా భారత్‌లో జరుగుతున్న ఉగ్రవాద దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటూ వస్తున్న పాక్, పఠాన్‌కోట్ విషయంలో మాత్రం మొట్టమొదటిసారిగా వాస్తవాన్ని అంగీకరించిందని అన్నారు. పఠాన్‌కోట్ దాడి మూలాలు తమ దేశంలోనే ఉన్నాయని పరోక్షంగా ఒప్పుకోవడమే గాకుండా ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసిందని తెలిపారు. ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి పాక్ బృందం భారత్ వచ్చిందని, భారత బృందం కూడా పాక్‌కు వెళుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, సానుకూల రాజకీయ దృక్పథం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.