జాతీయ వార్తలు

ప్రధానితో మెహబూబా ముఫ్తీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్‌లో మళ్లీ పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు మెరుగైనాయి. దీర్ఘకాల ప్రతిష్టంభన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించిన పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడంతో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.
ప్రధాని నివాసంలో దాదాపు పావుగంట సేపు సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన మెహబూబా ముఫ్తీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఈ సమావేశం చాలా సానుకూలమైన, మంచి పరిణామమని చెప్పారు. ఇటీవల బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో మెహబూబా జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో ఆమె తిరిగి కాశ్మీర్ లోయకు తిరిగి వెళ్లిన మూడు రోజులకే మళ్లీ ఢిల్లీ వచ్చిన ఒక రోజులోనే ప్రధానితో సమావేశం జరగడం గమనార్హం.
ఈ ఏడాది జనవరి 7న తన తండ్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మృతి చెందిన తర్వాత విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్రానికి అప్పగించడం, వరద బాధితులకు పరిహారం పెంపు, సైన్యం తన అధీనంలోకి తీసుకున్న స్థలాలను ఖాళీ చేయడం లాంటి అంశాలపై కఠిన వైఖరి అవలంబించిన మెహబూబా ముఫ్తీ ఆ డిమాండ్లపై ఒక మెట్టుదిగి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయాలపై ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టం చేయలేదు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై గత రెండు, మూడు నెలలుగా ప్రతిష్టంభన నెలకొనింది. అయితే ఈ రోజు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని ఆమె అన్నారు. అంతేకాదు, గురువారం జరిగే పిడిపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని కూడా ఆమె ప్రకటించారు. ప్రతిష్టంభన తొలగినట్లేనా అన్న ప్రశ్నకు ‘దేశ ప్రధానితో సమావేశమైనప్పుడు సహజంగానే జమ్మూ, కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం పరిష్కారం లభించినట్లే కదా?’ అని ఆమె అన్నారు. బిజెపి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను మోదీ-మెహబూబా సమావేశం గురించి అడగ్గా అది నిర్మాణాత్మకంగా, బాగా జరిగినట్లు ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రంలో వారం రోజుల్లో కొత్త అపభుత్వం ఏర్పడుతుందని పిడిపి వర్గాలు తెలిపాయి. మెహబూబా బుధవారం శ్రీనగర్ తిరిగి వెళ్లనున్నారు. అక్కడ ఆమె గురువారం పార్టీ శాసన సభ్యులకు ఈ సమావేశం వివరాలను వివరించనున్నారు. ‘ నిర్ణయం తీసుకునే అదికారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు నాకు ఇచ్చారు. గురువారం మేము ఒక సమావేశం ఏర్పాటు చేశాం. దాని తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుంది’ అని మెహబూబా చెప్పారు.

చిత్రం... మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయన
పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ