జాతీయ వార్తలు

మళ్లీ హత్యలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బిహార్‌లో అధికార జెడియు ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నౌగాచియా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మండల్ ‘నా దగ్గర తుపాకీ, పేలుడు పదార్థాలున్నాయి. మళ్లీ వాటికి పనిచెప్పి హత్యారాజకీయాలు మొదలెడతాను’ అన్నారు. భగల్పూర్ జిల్లా గోపాల్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేయకపోయినా తన అధికారం, ఆయుధాలతో వారిని కాపాడతానని ప్రకటించారు. ‘ గతంలో ఎన్నో హత్యలు చేశాను. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తాను’అని ఆయన అన్నారు. గోపాల్ మండల్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మండల్‌కు కొత్తకాదు. గతంలో నౌగచియా బజార్‌లో ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తన వ్యతిరేకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన మద్దతుదారుల జోలికొస్తే నాలుక కోసేస్తాని హెచ్చరించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్య నిషేధం అమలునూ మండల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మధ్యనిషేధం అమలుచేయాలని సిఎం యోచిస్తున్నారు. కాగా మండల్ వ్యాఖ్యలపై జెడియు అధికార ప్రతినిధి అజయ్ అలోక్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలు తీవ్రంగా ఖండించాల్సిందేనని అలోక్ చెప్పారు.
పాక్‌లో కల్తీ మద్యం తాగి
24 మంది హిందువులు మృతి
కరాచీ, మార్చి 22: పాకిస్తాన్‌లో కల్తీ మద్యం తాగి 24 మంది హిందువులు మృతి చెందారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో హోలీ వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. టాండో మహ్మద్ ఖాన్ జిల్లాలో సోమవారం రాత్రి హోలీ పండుగ సందర్భంగా కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన 34 మందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 24 మంది మృతి చెందారని సీనియర్ పోలీసు అధికారి హక్ నవాజ్ వెల్లడించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మిగతావారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆయన అన్నారు. హోలీ పండుగ కోసం ఓ డీలర్ నుంచి కొనుగోలు చేసిన చీప్ లిక్కర్ తాగి మృతి చెందారని నవాజ్ పేర్కొన్నారు. నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా ఈ సంఘటనకు బాధ్యుడైన పోలీసు హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. అక్రమ మద్యం అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 2014లో ఈద్ ఉల్ అజా సందర్భంగా హైదరాబాద్, కరాచీల్లో కల్తీ మద్యం తాగి 29 మంది మృతి చెందారు. పాకిస్తాన్‌లో ముస్లింలు ఆల్కాహాల్ తీసుకోవడంపై నిషేధం ఉన్నప్పటికీ ముస్లిం యేతరులకు రేషన్ ఆల్కాహాల్ అందుబాటులో ఉంటుంది. ఎక్సయిజ్ శాఖ వారి కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు నడుస్తున్నాయి.