జాతీయ వార్తలు

పట్టం కడితే ఎర్ర తివాచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సింగూర్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని టాటాలు, ఇతర పరిశ్రమల యజమానులతో మాట్లాడుతామని సిపిఎం మంగళవారం తెలియజేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో దీర్ఘకాలం ఆందోళన కారణంగా సింగూరులో ఏర్పాటు చేయదలచిన తమ చిన్న కార్ల తయారీ ఫ్యాక్టరీని టాటాలు గుజరాత్‌కు మార్చుకున్న విషయం తెలిసిందే. సింగూరుకు మళ్లీ రమ్మని మీరు మరోసారి టాటాలను అడుగుతారా? అని పిటిఐ ప్రశ్నించగా, ఒక్క టాటాలతోనే కాదు, ప్రతి ఒక్కరితోను మాట్లాడుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత్ మిశ్రా చెప్పారు. టాటాలు కొన్ని షరతులు పెడితే మేము అంగీకరించాల్సిన పరిస్థితికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అయితే నిర్దిష్టంగా ఏ పారిశ్రామిక సంస్థ పేరును ప్రస్తావించాలని తాను అనుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు. టాటాల నానో కార్ల ఫ్యాక్టరీకోసం భూమిని సేకరించేటప్పుడు సింగూరు రైతులను విశ్వాసంలోకి తీసుకోకపోవడం ద్వారా లెఫ్ట్‌ఫ్రంట్ తప్పు చేసిందా? అని అడగ్గా, నిజానికి తాము రైతులను విశ్వాసంలోకి తీసుకున్నామని, 90 శాతం మంది రైతులు తమ అంగీకారం కూడా తెలిపారని మిశ్రా చెప్పారు. అంతేకాదు తాము మొత్తం వ్యవహారంపై సమీక్ష జరిపి సున్నితమైన విషయాలను డీల్ చేసేటప్పుడు ఓపిగ్గా ఉండాలని కూడా నిర్ణయించుకున్నామని చెప్పారు. రైతులకు భూమి సున్నితమైన విషయమని, తాము ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామని కూడా ఆయన చెప్పారు. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఉండవచ్చని, తాను ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో సైతం చెప్పానని ఆయన అన్నారు. రైతులకు వారి భూమి కానీ, పరిశ్రమ కానీ రాలేదని, అందువల్ల తమను తప్పుదోవ పట్టించారనే విషయాన్ని రైతులు ఇప్పటికయినా గ్రహించి ఉంటారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోయారని, వారి భూమిని తిరిగి ఇవ్వలేదని మిశ్రా చెప్పారు.
పారిశ్రామిక రంగం కోసం లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం ఎంతో చేసిందని ఆయన చెప్తూ, తమ ప్రభుత్వ పాలన చివరి మూడేళ్లలో ఉత్పాదక రంగంలో తాము భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని, అయితే తృణమూల్ కాంగ్రెస్ మొత్తం అయిదేళ్ల పాలనలో ఆ మొత్తం 1500 కోట్లు కూడా దాటలేదని మిశ్రా చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం తమ ప్రధాన లక్ష్యమని మిశ్రా చెప్తూ టిఎంసి పాలనలో ఉద్యోగావకాశాలు పూర్తిగా స్తంభించిపోయాయని అన్నారు. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.