జాతీయ వార్తలు

పఠాన్‌కోట్ యోధుడికి ‘కీర్తి చక్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం 58 మంది జవాన్లను శౌర్య పతకాలతో సత్కరించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటబడి తరిమి వారిలో ఒకరిని మట్టుబెట్టిన తర్వాత శత్రువుల చేతిలో ప్రాణాలను కోల్పోయిన సిపాయి జగదీశ్ చాంద్ కూడా ఈ రోజు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జగదీశ్ చాంద్‌కు రెండవ అత్యున్నత పురస్కారమైన ‘కీర్తి చక్ర’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆహూతుల కరతాల ధ్వనుల మధ్య దివంగత జగదీశ్ చాంద్ భార్య రాష్టప్రతినుంచి ఈ అవార్డును అందుకున్నారు. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. గత ఏడాది జనవరి 27న జమ్మూ, కాశ్మీర్‌లోని పుల్వా మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా విధి నిర్వహణకు మించి కనీవినీ ఎరుగని రీతిలో మొక్కవోని ధైర్య సాహసాలను, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన కల్నల్ ఎంఎన్ రాయ్‌కి మరణానంతరం శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాయ్ భార్య రాష్టప్రతినుంచి ఈ అవార్డును అందుకున్నారు. అలాగే గత ఏడాది జనవరి 8న భారత్ -మైన్మార్ సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్‌లో పాలు పంచుకున్న హవిల్దార్ టాంకా కుమార్ లింబుకు కూడా శౌర్య చక్ర ప్రదా నం చేశారు.
జమ్మూ, కాశ్మీర్ పోలీసుకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లకు, అలాగే గత ఏడాది బిహార్‌లో నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సిఆర్‌పిఎఫ్ 7వ బెటాలియన్‌కు చెందిన హీరా కుమార్ ఝాకు మరణానంతరం శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేశారు. ఇదిలా ఉండగా నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ పి మురుగేశన్‌ను పరమ విశిష్ట సేవా పతకంతోను, ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ సుబ్రతా సాహాను ఉత్తమ యుద్ధ సేవా అవార్డుతో సత్కరించారు.

చిత్రం... వైస్ అడ్మిరల్ అశోక్ విశ్వనాథ్ సుబేదార్‌కు పరమ విశిష్ట సేవా పతకాన్ని అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్