జాతీయ వార్తలు

పోలీసు గుర్రంపై బిజెపి ఎమ్మెల్యే ‘ప్రతాపం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి మధ్య మంగళవారం వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ముస్సోరికి ప్రాతినిథ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే గణేశ్ జోషి ఒక నిరసన కార్యక్రమంలో పోలీసు గుర్రంపై దాడిచేసి తీవ్రంగా గాయపరచడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. సాధుజంతువు పట్ల గణేశ్ జోషి అత్యంత క్రూరత్వంతో వ్యవహరించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో గణేశ్ జోషితో పాటు అతని మద్దతుదారులపై జంతు సంరక్షణా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పూజా బహుఖండి సహా జంతు హక్కుల పరిరక్షణకోసం ఉద్యమిస్తున్న పలువురు కార్యకర్తలు కూడా గణేశ్ జోషి నిర్వాకంపై ధ్వజమెత్తుతున్నారు. అత్యంత అమానుషంగా వ్యవహరించిన ఆయనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజెపి కార్యకర్తలు సోమవారం రాష్ట్ర అసెంబ్లీకి నిరసన ప్రదర్శనగా బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. రిస్పానా వంతెన వద్ద పోలీసులు వీరిని అడ్డుకోబోగా, బ్యారికేడ్లను దూకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులతో పాటు అశ్విక దళం రంగంలోకి దిగగా, ఆగ్రహంతో ఊగిపోయిన గణేశ్ జోషి 13 ఏళ్ల వయసున్న ‘శక్తిమాన్’ అనే పోలీసు గుర్రాన్ని కర్రతో చావబాదాడు. దీంతో ఆ గుర్రం కాలు విరిగిపోయింది.

కుట్రలకు భయపడం
ఎన్నికల్లో విజయం మాదే: మమత
కుర్సియాంగ్ (పశ్చిమ బెంగాల్), మార్చి 15: ఎన్ని కుట్రలు జరిగినా భయపడేది లేదని, రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుంది. తెర వెనుక ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే. వాళ్లు నల్లధనాన్ని కుమ్మరిస్తున్నారు. మేము నిజాయితీతో పనిచేస్తున్నాం. ఎంతమాత్రం భయపడేది లేదు’ అని మంగళవారం డార్జిలింగ్ హిల్స్‌లో జరిగిన ఎన్నికల సభలో పేర్కొన్నారు. తృణమూల్‌కు వ్యతిరేకంగా సిపిఎం, కాంగ్రెస్, బిజెపి జట్టుకట్టాయనీ, సిద్ధాంతాలు కలిగిన ఏ పార్టీ కూడా ఇలాంటి పొత్తుకు పూనుకోదని మమత వ్యాఖ్యానించారు. డార్జిలింగ్ కొండ ప్రాంతంలో వేర్పాటువాద సంస్థ గోర్ఖా జనముక్తి మోర్చాకు సిపిఎం మద్దతు ఇస్తోందని ఆమె ఆరోపించారు. స్థానిక యువతను జిజెఎం భయపెడుతోందని, ఈ చర్యలను ప్రజలు, ముఖ్యంగా యువత దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

తగ్గిపోతున్న
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్, మార్చి 15: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకీ తగ్గిపోతోంది. మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 2411 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 508.40 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 128.9706 టీఎంసీలకు సమానం. విద్యుత్ ఉత్పాదన నిమిత్తం సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 3954 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జంటనగరాల తాగునీటి అవసరాలకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. టోటల్ అవుట్‌ఫ్లోగా 4354 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 811.30 అడుగులకు చేరుకుంది. ఇది 35.6294 టీఎంసీలకు సమానం