జాతీయ వార్తలు

హోరెత్తించిన హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యుల దుమారం
పదేళ్ల మాటేమైందంటూ నిలదీసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు
విభజన చట్టంలో హోదా చేర్చని కాంగ్రెస్: వెంకయ్య ధ్వజం
ఏపీకి అన్నీ చేస్తున్నాం: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేసింది. తెలుగురాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు ఈ అంశంపై మోదీ సర్కార్‌ను నిలదీశారు. ఐదేళ్లు కాదు..పదేళ్ల హోదా కావాలని పట్టుబట్టిన బిజెపి ఇప్పుడేమి చేస్తోందంటూ విరుచుకు పడ్డారు. హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చని పాపం కాంగ్రెస్‌దేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రకు ఇచ్చిన హామీల్లో చాలావాటిని అమలు చేశామని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. కొత్త సంస్థల్ని ఏర్పాటు చేశామని, రెండు రకాల పన్నుల్నీ మినహాయించామన్నారు.

అన్ని హామీల్ని అమలు చేస్తాం. నయాపైసాతో సహా లోటు భర్తీ చేస్తాం
-అరుణ్ జైట్లీ

హోదా అంశాన్ని విభజన చట్టంలో కాంగ్రెస్ ఎందుకు చేర్చలేదు?
-వెంకయ్య నాయుడు