క్రీడాభూమి

టీమిండియా నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: టి-20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్ మొత్తం 127 పాయింట్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా చెరి 118 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. కాగా, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ని గెల్చుకున్న దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసింది. ఒకవేళ చివరిదైన మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచినా, భారత్ నంబర్ వన్ స్థానానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ (116 పాయింట్లు) నాలుగు, ఇంగ్లాండ్ ఐదు, ఆస్ట్రేలియా ఆరు, పాకిస్తాన్ ఏడు, శ్రీలంక ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.
బ్యాటింగ్ విభాగానికి వస్తే భారత్ తరఫున విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 11, సురేష్ రైనా 16, యువరాజ్ సింగ్ 22, మహేంద్ర సింగ్ ధోనీ 43, శిఖర్ ధావన్ 48 స్థానాలను ఆక్రమించారు.
అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నారైన్ ఈటోర్నీకి హాజరుకావడం లేదు. అతను నంబర్ వన్ స్థానంలో ఉండగా, రెండో స్థానంలోని అశ్విన్ ఈసారి టి-20 వరల్డ్ కప్‌లో నంబర్ వన్ బౌలర్‌గా ఉంటాడు. రవీంద్ర జడేజా 11, జస్‌ప్రీత్ బుమ్రా 27, యువరాజ్ సింగ్ 43 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో యువీకి ఆరో స్థానం లభించింది. ఆ విభాగంలో భారత్ తరఫున ఇతరులెవరికీ స్థానం దక్కలేదు.

పాక్ అభిమానులకు వీసాలు
న్యూఢిల్లీ, మార్చి 7: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను చూడాలని కోరుతున్న 250 మంది పాకిస్తాన్ వీరాభిమానులకు వీసాలు మంజూరు చేయాలని భారత్ నిర్ణయించింది. ధర్మశాలలో ఈనెల 19న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజీ మ్యాచ్‌కి కూడా అభిమానులు హాజరయ్యే విధంగా ముందుగానే వీసాలను జారీ చేయాలని కేంద్రం స్పష్టం చేసినట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. టికెట్లను చూపిస్తే, ఐదు రోజుల వీసాను మంజూరు చేస్తామని ఈ వర్గాలు అన్నాయి. ఒకవేల పాకిస్తాన్ సెమీ ఫైనల్ లేదా ఫైనల్ చేరితే వీసాల సంఖ్యను పెంచుతామని వివరించాయి.