జాతీయ వార్తలు

ఇళయరాజాకు శతాబ్ది సంగీత పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, నవంబర్ 20: దశాబ్దాలుగా భారతీయ సంగీతానికి ఎనలేని సేవలందిస్తూ దక్షిణాదిన వినూత్న బాణీలతో ఎప్పటికప్పుడు కొత్త ఒరవడులు సృష్టిస్తూ వచ్చిన సంగీత విద్వాంసుడు ఇళయరాజాకు ఈ ఏటి మేటి వ్యక్తిగా శతాబ్దపు అవార్డు లభించింది. భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా ఆర్థిక, సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఈ పురస్కారాన్ని ఇళయరాజాకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన స్కూళ్లు, కాలేజీల్లో సంగీతాన్ని తప్పనిసరి పాఠ్యాంశంగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ చేయడానికి ఇది సరైన సమయం, వేదిక కాకపోయినప్పటికీ సంగీతాన్ని పరివ్యాప్తం చేయడానికి స్కూళ్లు, కాలేజీ పాఠ్యాంశాల్లో దీన్ని నిర్బంధ పాఠ్యాంశంగా మార్చడం ఎంతో అవసరమని తెలిపారు. వెయ్యి సినిమాలకు ఇళయరాజ సంగీతాన్ని సమకూర్చారని తాను విన్నానని, దీన్ని బట్టి చూస్తే ఆయన సంగీతం ఎంత ఉన్నతమైనదో, ఆయన సేవలకు లభించిన గుర్తింపు ఎంతటిదో స్పష్టమవుతోందని అరుణ్ జైట్లీ అన్నారు.

చిత్రం... గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న చిత్రోత్సవంలో శుక్రవారం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చేతులమీదుగా శతాబ్ది సంగీత పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఇళయరాజా