జాతీయ వార్తలు

బిహార్ సిఎంగా నితీశ్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, నవంబర్ 20: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఆ యనతో పాటుగా 28 మంది మం త్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసా రు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ ఇద్దరు కుమారులు తేజస్వి, తేజ్‌ప్రతాప్‌లు ఉండడం గమనార్హం. పాట్నా గాంధీ మైదాన్‌లో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపియేతర పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన వారిలో నితీశ్ కాకుండా జెడి(యు), ఆర్‌జెడి పార్టీలనుంచి చెరి 12 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురున్నారు. నితీశ్ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తేజస్వియాదవ్‌ను ఉపముఖ్యమంత్రిని చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఆయనను ఉపముఖ్యమంత్రిగా నియమించారు. సాయంత్రం ఇతర మంత్రులకు శాఖలను కేటాయించిన నితీశ్ హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు.
హార్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ సహా పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినిధిగా కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. సిపిఎంకు చెందిన సీతారాం ఏచూరి, సిపిఐకి చెందిన డి రాజా కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చారు. ప్రస్తుత నితీశ్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉండిన జెడి(యు) రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ లల్లన్, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, జయ కుమార్ సింగ్‌తో పాటుగా మాజీ ఎంపి మహేశ్వర్ హజారి తదితరులు జెడి(యు) తరఫున మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు వరసకు సోదరుడైన హజారి కళ్యాణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాశ్వాన్ మేనల్లుడు ప్రిన్స్ రాజ్‌ను ఓడించారు. అంతకు ముందు లోక్‌సభ ఎన్నికల్లో కూడా హజారి పాశ్వాన్ సోదరుడు రామచంద్ర పాశ్వాన్‌ను ఓడించారు. ఆర్‌జెడి కోటానుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో లాలూ కుమారులు కాక అబ్దుల్ బారీ సిద్దీఖి, అబ్దుల్ గఫూర్, విజయ్ ప్రకాశ్, చంద్రికా రాయ్, అలోక్ కుమార్ మెహతా, రామ్ విచార్ రాయ్, శేవోచందర్ రామ్, మునేశ్వర్ చౌదరి, చంద్రశేఖజర్, అనితా దేవి ఉన్నారు. ఆర్‌జెడినుంచి ఏకైక మహిళా మంత్రి అయిన అనిత నోఖా అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి సీనియర్ నేత రామేశ్వర్ చౌరాసియాను ఓడించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చౌదరి, మదన్ మోహన్ ఝా, అబ్దుల్ జలీల్ మస్తాన్, అవధేశ్ కుమార్ సింగ్‌లు మంత్రులుగా ప్రమాణం చేసారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 243స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో మహా కూటమి మొత్తం 178 స్థానాలను గెలుచుకోగా, ఆర్‌జెడి 80 స్థానాలు, జెడి (యు) 71, కాంగ్రెస్ 27 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో 15 శాతం దాకా మంత్రివర్గ సభ్యులుండవచ్చు. అంటే ఈ లెక్కన నితీశ్ మంత్రివర్గంలో ఆయనతో కలుపుకొని 36 మంది మంత్రులు ఉండవచ్చు.
chitram..
నితీశ్ కుమార్‌ను అభినందిస్తున్న నేతలు