జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపూర్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే రాయపూర్, రాజ్‌నందన్‌గావ్ జిల్లాల్లో కట్టుదిట్టమైన బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ రాజ్‌నందన్‌గావ్ జిల్లాలోని కుర్రుభట్ గ్రామంలో ‘రూర్‌బన్ మిషన్’ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాష్ట్ర నూతన రాజధాని నయా రాయపూర్‌లో సైతం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం 8.45 గంటలకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడినుంచి సత్యసాయి ఆస్పత్రికి బయలుదేరి వెళ్తారని, అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిం చే ఇళ్లకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పౌర సంబంధాల అధికారి ఒకరు చెప్పారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్‌బన్ మిషన్‌ను ప్రారంభిస్తారు. కాగా, ప్రధాని రాకను పురస్కరించుకుని ఎస్‌పిజి అధికారులు, రాష్ట్ర పోలీసులు, పారా మిలిటరీ దళాల అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను చూస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రూర్‌బన్ మిషన్ కింద రాజ్‌నందన్‌గావ్, ధమ్‌తారి, కబీర్ ధామ్, బస్తర్ జిల్లాల్లో 120 కోట్ల రూపాయల వ్యయంతో పలు స్మార్ట్ విలేజ్‌లను అభివృద్ధి చేస్తారని ప్రజా సంబంధాల అధికారి చెప్పారు. ప్రధాని రాకను పురస్కరించుకుని నయా రాయపూర్‌లో భద్రతను మ రింత కట్టుదిట్టం చేశారని, 1500 మందికి పైగా భద్రతా సిబ్బందిని భద్రతకోసం నియమించనున్నట్లు ఆయన చెప్పారు.

అలీగఢ్ వర్శిటీలో
బీఫ్ బిర్యానీ కలకలం
అలీగఢ్, ఫిబ్రవరి 20: దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థ అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ చోటుచేసుకున్న వివాదం ఉద్రిక్తలకు దారితీసింది. యూనివర్శిటీ క్యాంటిన్‌లో బీఫ్ బిర్యానీ వడ్డించారన్న సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కలకలం సృష్టించాయి. ఎఎంయు మెడికల్ కాలేజీ క్యాంటిన్‌లో బీఫ్‌బిర్యానీ వడ్డించినట్టు వాట్సప్‌లో వచ్చిన కథనాలను ఆసరా చేసుకుని బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. అయితే యూనివర్శిటీ యాజమాన్యం వాటిని తోసిపుచ్చింది. క్యాంటిన్ మెనూ కార్డును వాట్సప్‌లో పోస్టు చేశారు. అది దావానంలా వ్యాపించింది. కాగా దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి మేయర్ శకుంతల భారతి, పార్టీ కార్యకర్తలు సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. సంఘటన తెలిసిన వెంటనే వర్శిటీ సీనియర్ అధికారి మొసిన్ ఖాన్ నేతృత్వంలో అధికారులు మెడికల్ కళాశాల క్యాంటిన్‌ను సందర్శించారు. క్యాంటీన్‌లో అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవని నిర్ధారించిన తరువాత వర్శిటీ అధికార ప్రతినిధి రహత్ అబ్రార్ మీడియాతో మాట్లాడారు. క్యాంటిన్ కాంట్రాక్టర్ గడువుపూర్తయిపోతుందన్న దుగ్దతోనే ఉద్దేశపూర్వకంగా దీన్ని ప్రచారం చేయించాడని ఆయన ఆరోపించారు. ఈనెల 23తోకాంట్రాక్టు రద్దువుతోందని అబ్రార్ తెలిపారు. వదంతులు పుట్టించి సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి జరిగిన కుట్రలో భాగమే ఇదంతాఅని ఆయన స్పష్టం చేశారు. క్యాంపస్‌లో బీఫ్ వంటకాలు నిషేధించిన మొట్టమొదటి వర్శిటీ తమదేనని ఆయన వివరించారు. వందేళ్ల క్రితమే బీఫ్‌ను వర్శిటీలో నిషేధించినట్టు ఆయన పేర్కొన్నారు.
‘్భరత్‌లో మానవ హక్కులను,
మత స్వేచ్ఛను అణచివేస్తున్నారు’
అమెరికా జూనియర్ సెనేటర్ ఆరోపణ
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: మత స్వేచ్ఛను, మానవ హక్కులను భారత్ అణచివేస్తోందని అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన జూనియర్ సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ ఆరోపించాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో దౌత్య సంబంధాలను పెంపొందించుకోవడంపై అమెరికా పునరాలోచన చేయాలని ఆయన తమ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశాడు. భారత్‌తో పాటు క్యూబాలో మానవ హక్కులు, మత స్వేచ్ఛ నామమాత్రంగా ఉందని, కనుక ఈ రెండు దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడంపై అమెరికా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆ లేఖలో కోరాడు. ‘మత స్వేచ్ఛను, మానవ హక్కులను భారత్ అణచివేస్తోంది. కనుక మత స్వేచ్ఛను, అన్ని మతస్థుల మానవ హక్కులను భారత్ గౌరవించేలా వత్తిడి తీసుకురావాలని ఒబామా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఓక్లహామాకు ప్రాతినిథ్యం వహిస్తున్న జూనియర్ సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ తన లేఖలో పేర్కొన్నాడు.

మరో 5 రాఫ్ బెటాలియన్ల ఏర్పాటుకు యోచన
జంషెడ్‌పూర్, ఫిబ్రవరి 20: సిఆర్‌పిఎఫ్‌లో అల్లర్ల నిరోధక విభాగాన్ని బలోపేతం చేసేందుకు మరో ఐదు బె టాలియన్లను ఏర్పాటు చేయాలని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) యోచిస్తోంది. ఉక్కు నగరంగా పేరు పొందిన జంషెడ్‌పూర్‌లో 106 బెటాలియన్‌ను తనిఖీ చేసేందుకు వచ్చిన ఆర్‌ఎఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కెఎస్. భండారీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. సిఆర్‌పిఎఫ్‌లో అల్లర్ల నిరోధక విభాగాన్ని పటిష్టం చేసేందుకు కొత్తగా మరో ఐదు బెటాలియన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన విలేఖర్లకు వివరించారు. కొ త్తగా ఏర్పాటుచేసే ఐదు బెటాలియన్లను అల్వార్, బెంగళూరు, పాట్నా, వారణాసితో పాటు ఈశాన్య ప్రాం తంలోని సిలిగురిలో ఏర్పాటు చేయ డం జరుగుతుందని, ఈ విషయమై బిహార్ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చ లు జరిపామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆర్‌ఎఎఫ్‌లోని 10 బెటాలియన్లలో సుమారు 12 వేల మంది సి బ్బంది ఉన్నార ని, కొత్తగా బెటాలియన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అమలైతే దాదాపు మరో 6 వేల మంది ఆర్‌ఎఎఫ్‌లో చేరే అవకాశం ఉందని భండారీ తెలిపారు.

ట్వీట్ల యుద్ధం!

శ్రీనగర్, ఫిబ్రవరి 20: ఢిల్లీ జెఎన్‌యు సంఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్, బిజెపి మధ్య ట్విట్లర్ల యుద్ధం సాగుతోంది. జెఎన్‌యులో చదువుతున్న కాశ్మీర్ విద్యార్థులను ప్రశ్నించాలన్న బిజెపి మద్దతుదారు అశోక్ పండిట్ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్ షోరాను విచారించాలని బిజెపి నేత తన ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. జెఎన్‌యు ఉదంతాన్ని సాకుగా చూపి కాశ్మీర్ విద్యార్థులను టార్గెట్ చేసి వేధించేందుకు కుట్ర జరుగుతోందని ఒమర్ తన ట్విట్టర్‌లో ఎదురుదాడి చేశారు. ఫిబ్రవరి 9న జెఎన్‌యులో జరిగిన గొడవలను ఆసరాచేసుకుని కాశ్మీర్ ముస్లిం విద్యార్థులపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ కార్యనిర్వహక అధ్యక్షుడు అబ్దుల్లా ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే అశోక్ పండిట్ వరస ట్వీట్లు అని ఆయన అన్నారు.‘షెహ్లా రషీద్ షోరా జెఎన్‌యు యూనియన్ ఉపాధ్యక్షురాలు. ఆమె కాశ్మీర్ ముస్లిం విద్యార్థిని. ఆమె బాబారామ్‌దేవ్‌ను వ్యతిరేకించింది. అంతేకాదు.. గొడవలకు కారణమైన ఉమర్ ఖలీద్ ఆమె సహకారంతోనే తప్పించుకుపోయాడు’అని బిజెపి మద్దతుదారు పండిట్ ట్విట్లు చేశారు. అంతటితో ఆగక రషీద్‌కు హురియత్ కాన్సరెన్స్‌తో సంబంధాలున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పండిట్ వ్యాఖ్యలపై‘అవును కాశ్మీర్ ముస్లిం అయినందుకు అలాగే రామ్‌దేవ్‌ను వ్యతిరేకించినందుకు విచారించాల్సిందే’నని వ్యం గ్యంగా అన్నారు.
జెఎన్‌యు ఉదంతాన్ని సాకుగా చూపి ఒక వర్గం వారిపై కక్ష సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సహా పలు యూనివర్శిటీల్లో ఇటీవల చోటుకేసుకున్న సంఘటనలపై ఒమర్ విచారం వ్యక్తం చేశారు