జాతీయ వార్తలు

ఇప్పుడు అపోహలన్నీ సమసిపోయాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నేపాల్ కొత్త రాజ్యాంగం విజయవంతం కావడమనేది ఏకాభిప్రాయం, చర్చలపై ఆధారపడి ఉందని, నేపాల్ శాంతి, సుస్థిరత, సమగ్రాభివృద్ధినే భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని శనివారం ఇక్కడ నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలితో విస్తృత చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అన్ని అంశాలపైన, ముఖ్యం గా నేపాల్‌లో రాజకీయ పరిస్థితిపైన ఇరువురు నేతలు విస్తృతంగా చర్చలు జరిపారు.
అనంతరం ఓలి మీడియాతో మాట్లాడుతూ, తమ చర్చల తర్వాత గత కొన్ని నెలలుగా ఉండిన దురభిప్రాయాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయని అన్నారు. ఇరుపక్షాలు రవాణా, విద్యుత్ రంగాలు సహా వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు తొమ్మిది అవగాహనా ఒప్పందాలపై (ఎంఓ యు) సంతకాలు కూడా చేశాయి. భారతీయులతో కుటుంబ పరంగా, సంస్కృతీ పరంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న మధేసీ తెగకు చెందిన వారు నేపాల్ నూతన రా జ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన నేపథ్యంలో భారత్, నేపాల్ మధ్య సంబంధాలు కొంతమేరకు బెడిసిన విషయం తెలిసిందే. ‘నేపాల్‌లో దశాబ్దాల పోరాటం తర్వాత కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఒక గొప్ప విజయం. ఇందులో నేపాల్ రాజకీయ నాయకత్వం, ప్రజల పాత్ర ఎంతో ఉంది. అయితే ఇది విజయవంతం కావడం ఏకాభిప్రాయం, చర్చలపై ఆధారపడి ఉంది. ఈ సూత్రాల ఆధారంగా రాజకీయ చర్చలు, అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా మీరు రాజ్యాంగానికి సంబంధించిన అన్ని అంశాలను సంతృప్తికరంగా పరిష్కరించగలరని, నేపాల్‌ను అభివృద్ధి, సుస్థిరత దిశగా తీసుకువెళ్లగలరన్న నమ్మకం నాకు ఉంది’ అని ఓలీ సమక్షంలో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మోదీ అన్నారు.
నేపాల్ శాంతి సుస్థిరత, సమగ్రాభివృద్ధినే భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని ఆయన అంటూ, దీనికోసం అవసరమైన సాయమంతా అందిస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం గురించి ప్రస్తావిస్తూ ‘ఉగ్రవాదులు, నేరగాళ్లు ఎలాంటి అడ్డంకులు లేని మన సరిహద్దులను ఉపయోగించుకోవడానికి మేము అనుమతించం. ఈ విషయంలో రెండు దేశాల భద్రతా ఏజన్సీలు తమ సహకారాన్ని మరింత పెంపొందించుకుంటాయి’ అని మోదీ చెప్పారు. కాగా, భారత్ నేపాల్‌కు ఎప్పుడు మంచి మిఅత దేశంగానే ఉంటుందని ఓలి అన్నారు.
నేపాల్ సుస్థిరత భారత దేశ భద్రతతో ముడిపడి ఉందని, పెరిగిపోతున్న తీవ్రవాదం, ఉగ్రవాదంతో కలిసి పోరాడడానికి ఇరు దేశాలు అంగీకరించాయని మోదీ చెప్పారు. ఇరువురు ప్రధానులు 400 కెవి ధల్కేబార్-ముజఫర్‌పూర్ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను హైదరాబాద్ హౌస్‌నుంచి టెలీ ప్రారంభం ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ లైన్ ద్వారా భారత్ మొదట్లో నేపాల్‌కు 80 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. రెండేళ్లలో దీన్ని 600 మెగావాట్లకు పెంచుతారు. భారత సాయం ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే ఉంటోందని, నేపాల్‌లో పలు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయని మోదీ చెప్పారు. నేపాల్‌లో ఇటీవల సంభవించిన పెను భూకంపాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, భూకంపం నేపాల్‌లో సంభవించినప్పటికీ అది ప్రతి భారతీయుడ్నీ కలచి వేసిందని అన్నారు. భారత దేశం అందిస్తున్న వంద కోట్ల డాలర్ల ఆర్థిక సహకారం ఈ రంగంలో మన సహకారాన్ని మరింత ముం దుకు తీసుకువెళ్తుందన్నారు. అంతకు ముందు ఆరు రోజుల పర్యటనకు వచ్చిన ఓలికి రాష్టప్రతి భవన్ వద్ద సంప్రదాయకంగా స్వా గతం పలికారు. ఈ కార్యక్రమంలో మోదీ సైతం పాల్గొన్నారు. ఇరువురు ప్రధానుల భేటీకి ముందు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఓలితో భేటీ అయ్యా రు. ఓలి పర్యటన ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా సుష్మ అన్నారు. ఓలి వెంట ఆయన సతీమణి రాధికా సాఖ్య, ఉపప్రధాని, విదేశాంగ మంత్రి కమల్ థాపా, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడ్యాల్, విద్యుత్ శాఖ మంత్రి తోప్ బహదూర్ రయమాజి, హోం మంత్రి శక్తి బస్నేత్ తదితరులు కూడా వచ్చారు.
chitram...
శనివారం ఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన నేపాల్ ప్రధాని