జాతీయ వార్తలు

రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండి బకాయిలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుండటం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకు రూ.500 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలను ఎగ్గొట్టిన సంస్థల జాబితాను సమర్పించాలని సుప్రీం కోర్టు మంగళవారం రిజర్వు బ్యాంకును ఆదేశించింది. అంతేకాకుండా కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాల కింద రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకున్న సంస్థల జాబితాను కూడా ఆరు వారాల్లోగా సీల్డ్‌కవర్‌లో అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్థకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆర్‌బిఐకి స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ యుయు.లలిత్, ఆర్.్భనుమతి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సరైన మార్గదర్శకాలు లేకుండా భారీ మొత్తాల్లో రుణాలను ఎందుకు ఇస్తున్నాయన్న దానితో పాటు ఆ రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు తగిన యంత్రాంగం ఉందో లేదో తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ రంగంలోని హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొన్ని సంస్థలకు భారీ మొత్తాల్లో రుణాలను అందజేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సిపిఐఎల్ (సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) అనే ఎన్‌జిఓ 2005లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతూ ఆర్‌బిఐకి పై ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై సిపిఐఎల్ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ, 2015లో 40 వేల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలను అప్పనంగా మాఫీ చేసినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తూ, ప్రభుత్వ రంగ బ్యాంకులను మొండి బకాయిలు దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.