జాతీయ వార్తలు

అరెస్టులు కంటితుడుపు చర్యలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: లష్కరే తోయిబా సీనియర్ నేతలు జకీవుర్ రెహమాన్ లఖ్వీ, హఫీజ్ సరుూద్‌లకు ఏమీ కాదని, 26/11 ముంబయి దాడుల కేసులో పాకిస్తాన్ ఫెడరల్ దర్యాప్తు ఏజెన్సీ వారిపైన, ఇతర లష్కరే తోయిబా నేతలపైనా తీసుకున్న చర్యలు అన్నీ కంటితుడుపు చర్యలేనని ఐఎస్‌ఐలో తనతో వ్యవహారాలు సాగించిన నేతలు తనకు చెప్పారని ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ చెప్పాడు. రహస్య సమాచారాన్ని సంపాదించేందుకు కొంతమంది భారతీయ ఆర్మీ జవాన్లను రిక్రూట్ చేయాలని ఐఎస్‌ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ తనకు చెప్పాడని, అతని ఆదేశాలపై తాను 2009లో పుణెలోని ఆర్మీ సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించానని కూడా అతను చెప్పాడు. ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న హెడ్లీ గత సోమవారంనుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఎదుట వాంగ్మూలం ఇస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా హెడ్లీ తన వాంగ్మూలంలో ముంబయి ఉగ్రవాద దాడుల తర్వాత జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల గురించి పలు వాస్తవాలను బైటపెట్టాడు.
2009లో తాను పుష్కర్, గోవా, పుణె నగరాలను సందర్శించానని, అల్‌ఖైదాకు చెందిన ఇల్యాస్ కాశ్మీరీ కోరినట్లుగా ఆ నగరాల్లో రెక్కీ నిర్వహించానని కూడా హెడ్లీ చెప్పాడు. లష్కరే తోయిబా అగ్రనేతలైన జకీవుర్ రెహమాన్ లఖ్వీ, హఫీజ్ సరుూద్ క్షేమంగా ఉన్నారని, వారికేమీ జరగదని ముంబయి ఉగ్రవాద దాడుల కేసులో పాకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన తర్వాత తనకు ఆదేశాలు ఇచ్చే లష్కరే తోయిబాలోని సాజిద్ మీర్ తనకు చెప్పాడని కూడా తెలిపాడు. అంతేకాదు లఖ్వీ, హఫీజ్ సరుూద్, ఇతర లష్కరే తోయిబా నేతలపై పాకిస్తాన్ ఫెడరల్ ఏజెన్సీ తీసుకున్న చర్యలన్నీ కంటితుడుపు చర్యలేనని కూడా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మాజీ మేజర్ అబ్దుల్ రెహమాన్ పాషా తనకు చెప్పాడని కూడా హెడ్లీ కోర్టుకు తెలిపాడు. ఆర్మీనుంచి రిటైరయిన తర్వాత పాషా లష్కరే తోయిబాలో, ఆ తర్వాత అల్‌ఖైదాలో చేరాడు.
కాగా, 2009 మార్చి 16న తాను పుణె వెళ్లి, అక్కడి సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించానని హెడ్లీ తెలిపాడు. అంతకుముందు కూడా ఇక్బాల్ తనను ఆ ప్రాంతాన్ని సందర్శించమని చెప్పాడని హెడ్లీ చెప్తూ, బయటినుంచి ఆర్మీ స్టేషన్‌ను వీడియో తీశానని కూడా తెలిపాడు. 2009 జూలై 3 మొదలు 2009 సెప్టెంబర్ 11 వరకు తనకు, లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్‌కు మధ్య పలు ఇ-మెయిల్స్ నడిచాయని, లష్కరే తోయిబా అగ్ర నాయకుల భద్రతకు సంబంధించి భయాలను తాను వాటిలో వ్యక్తం చేశానని హెడ్లీ కోర్టుకు తెలిపాడు. అయితే లఖ్వీ, హఫీజ్ సరుూద్ క్షేమంగా ఉన్నారని, వారికేమీ కాదని మీర్ తనకు చెప్పాడని వెల్లడించాడు.

సియాచిన్ బేస్ క్యాంప్‌కు
సైనికుల మృతదేహాలు
జమ్ము, ఫిబ్రవరి 13: పాక్ సరిహద్దులోని సియాచిన్ ప్రాంతంలో మంచు తుఫానులో చిక్కుకుని మరణించినవారి మృతదేహాలను ఎట్టకేలకు సియాచిన్ బేస్ క్యాంప్‌కు తరలించారు. వాతావరణం కొంత అనుకూలించడంతో మృతదేహాలను బేస్ క్యాంప్‌కు తరలించగలిగామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ మృతదేహాలను లేహ్ ప్రాంతానికి తీసుకురావడానికి మరింత సమయం పడుతుందని, ఈ లోపుగా హుందర్ (పార్థాపూర్)లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. సియాచిన్ మంచు శిఖరాల్లోని మృతదేహాలను తరలించడానికి వాతావరణం అనుకూలించలేదని, అందుకే మృతదేహాల తరలింపు ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ నెల 3వ తేదీన విధి నిర్వహణలో ఉన్న జూనియర్ కమిషన్ అధికారితోపాటు మరో 9మంది సియాచిన్‌లో మంచుకొండలు విరిగిపోవడంతో కనిపించకుండా పోయిన విషయం తెలిపిందే. ఈ మంచుకొండలు 19,600 అడుగుల ఎత్తులో, మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండడం వల్ల అక్కడి వెళ్లడమే ఒక సాహసోపేత చర్య. అయితే సహాయక చర్యలు చేపడుతున్న సైనికులకు అనూహస్యంగా లాన్స్ నాయక్ హనుమంతప్ప కోపాడ్ కొనవూపిరితో కనిపించడం, ఆయనను ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత మరణించిన విషయం విదితమే. ఇలావుండగా, ఈ నెల 9వ తేదీన మరో తొమ్మిది మృతదేహాలను వెలికితీసిన సహాయ సిబ్బంది వీటిని ఎట్టకేలకు సియాచిన్ క్యాంప్ బేస్‌కు తరలించగలిగారు.

వారం తర్వాత కనిపించిన
ఆర్మీ కెప్టెన్ శిఖర్‌దీప్
కతిహార్ (బీహార్), ఫిబ్రవరి 13: వారం రోజుల క్రితం కనిపించకుండాపోయిన ఆర్మీ కెప్టెన్ శిఖర్‌దీప్ అనూహ్యంగా శనివారంనాడు ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. జమ్ముకాశ్మీర్‌లోని నౌషెరా వద్ద విధులు నిర్వహించే ఆర్మీ కెప్టెన్ సెలవులో ఉన్నాడు. ఈ నెల 6వ తేదీన కతిహార్ నుంచి ఢిల్లీకి మహానంద ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన శిఖర్‌దేప్ ఢిల్లీకి చేరుకోలేదు. ఈ మేరకు ఆయన బావమరిది కతిహార్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన శిఖర్‌దీప్ శనివారం ఫైజాబద్ చేరుకుని పోలీసులను ఆశ్రయంచాడు. శిఖర్‌దీప్ తెలిపిన వివరాల మేరకు- మహానంద ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆయన పాట్నా జంక్షన్‌లో దిగి మంచినీళ్లు తాగాడు. అనంతరం స్పృహ కోల్పోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి గుర్తుతెలియని ప్రదేశంలో ఓ కుర్చీలో కట్టివేయబడి ఉన్నాడు. ఎలాగోలా బంధనాలు విడిపించుకుని కొంతదూరం పరుగెత్తాడు. కొన్ని కిలోమీటర్లు అలా పరుగెత్తి కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలును అందుకున్నాడు. కొత్వాలి పోలీసు స్టేషన్‌కు చేరుకుని తనను తాను పరిచయం చేసుకుని అన్ని వివరాలు తెలిపాడు. అయితే ఆయన కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ను ఏ ప్రాంతంలో అందుకున్న విషయాన్నీ చెప్పలేకపోయాడు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.