జాతీయ వార్తలు

శోకసంద్రమైన బెతదూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధార్వాడ్: సియాచిన్‌లో ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలతో బైటపడినప్పటినుంచి మృత్యువుతో పోరాటం జరిపిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప చివరికి గురువారం కన్ను మూశారన్న వార్త తెలియగానే ధార్వాడ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం శోకసంద్రంగా మారింది. హనుమంతప్ప మృతి చెందాడన్న వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో ఆయన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల గ్రామాలవారు, మీడియా బృందాలు ఆయన స్వగ్రామమైన ధార్వాడ్ జిల్లా కుందగోల్ తాలూకా బెతదూర్ గ్రామానికి చేరుకున్నారు. హనుమంతప్ప భార్య మహాదేవి కుమార్తె, సన్నిహిత బంధువులతో పాటుగా ఢిల్లీలో ఉండగా, గ్రామంలోని మిగతా కుటుంబ సభ్యులంతా కూడా హనుమంతప్ప మృతి వార్త విని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ నెల 13న జరగనున్న హెబ్బాళ్ అసెంబ్లీ ఉప ఎన్నికకోసం బెంగళూరులో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాన్స్‌నాయక్ హనుమంతప్ప మృతి వార్త తెలియగానే ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. దేశంకోసం హనుమంతప్ప తన ప్రాణాలను త్యాగం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. సియాచిన్ దుర్ఘటనలో మృతిచెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లు మైసూరుకు చెందిన మహేశ్, హాసన్‌కు చెందిన నగేశ్, హనుమంతప్పల కుటుంబాలకు ఎక్స్‌గేషియాను ప్రకటించడం జరుగుతుందని సిద్ధరామయ్య చెప్పారు. కాగా, హనుమంతప్ప ఒకటి, రెండు రోజుల్లో కోలుకుంటారని, గ్రామానికి తిరిగి వస్తారని తామంతా అనుకున్నామని, ఆయన చనిపోయినట్లు తెలిసి తమకెంతో బాధవేసిందని హనుమంతప్ప స్నేహితుడు మంజునాథ్ కంటికి, మంటికి ఏకధాటిగా రోదిస్తూ చెప్పాడు. హనుమంతప్ప కోలుకోవాలని తాము అందరి దేవుళ్లను ప్రార్థించామని, అయితే ఏ దేవుడూ తమ మొర ఆలకించలేదని ఆయన అంటూ, హనుమంతప్ప మృతితో ఆయన కుటుంబం గుండె చెరువై పోయిందన్నాడు.

హనుమంతప్ప మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన బంధుమిత్రులతో నిండిన నివాస గృహం