జాతీయ వార్తలు

బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై కోర్టు కేసులు ఎదుర్కొంటున్న రాజేంద్ర కె పచౌరిపై గతంలో ఆయన వద్ద పని చేసిన మరో మహిళా ఉద్యోగి కూడా గురువారం అలాంటి ఆరోపణలే చేసింది. తాజాగా ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి ‘ది ఎనర్జీ, రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (తేరి)లో 2003లో చేరింది. అప్పుడు పచౌరి ఆ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. పదేళ్ల క్రితం తాను తేరిలో పని చేసినప్పుడు ఎదురైన చేదు అనుభవాలను ఆ మహిళ మీడియాకు వివరించింది. చర్చించడానికి ఎలాంటి విషయం లేనప్పటికీ ఏదో ఒక సాకు చూపించి పచౌరి తనను తన గదికి పిలిచేవాడని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేదని, అందుకే తాను కొన్ని మీటింగ్‌లను తప్పించుకోవడమో లేదా ఆ మీటింగ్‌లకు వెళ్లమని తన కోలీగ్స్‌కు చెప్పడమో చేసేదాన్నని చెప్పింది. వరసగా లైంగిక వేధింపులకు పాల్పడిన పచౌరిని నిజానికయితే ఇప్పటికే శిక్షించి ఉండాల్సిందని, అయితే ఆయనకు మరింత పెద్ద పదవి రివార్డుగా ఇచ్చారని, ఇది మన దేశ చట్టాలను, ఆయనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి (మహిళ) చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. పచౌరి వ్యక్తిత్వం, మహిళా ఉద్యోగుల పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉండేదో లోకానికి చూపించడానికి ప్రస్తుతం ఆయనపై జరుగుతున్న కేసులో తానే ఒక సాక్షిగా హాజరుకావాలని అనుకుంటున్నట్లు కూడా ఆమె చెప్పింది. ఒకసారి తాను పచౌరి రూమ్‌నుంచి బైటికి వచ్చే సమయంలో ఆయన తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బలవంతంగా కౌగలించుకుని ముఖంపై ముద్దు పెట్టుకున్నారని ఆమె తెలిపింది. ఆ సంఘటనతో దిగ్భ్రాంతికి గురయిన తాను వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశానని, తన రాజీనామా లేఖను చూసినప్పుడు పచౌరి నువ్వు ఎలా ఉద్యోగం వదిలిపెడతావో చూస్తానని బెదిరించారని కూడా ఆమె తెలిపింది.

సెలవుపై వెళ్లిన పచౌరీ
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న పచౌరీని తేరి యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నియమించడంపై ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అంతేకాదు, ఆయననుంచి డిగ్రీలు తీసుకోవడానికి కొంతమంది విద్యార్థులు నిరాకరించిన నేపథ్యంలో మార్చి 7న జరగనున్న యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కూడా ఆయన గైరుహాజరవుతున్నారు. యూనివర్శిటీ విసిగా ఉండిన పచౌరిని ఇటీవలే కొత్తగా సృష్టించిన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పదవిలో నియమించారు. అయితే దీనిపై పలవురు పూర్వ విద్యార్థులతో పాటుగా దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమ నేతలు సైతం మండిపడుతున్నారు.