జాతీయ వార్తలు

మలేరియా రహిత భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భారత్‌ను 2030 నాటికి మలేరియా రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా స్పష్టం చేశారు. మలేరియా నిర్మూలన కార్యక్రమానికి నిధుల కేటాయింపు పెంచినట్టు గురువారం ఇక్కడ చెప్పారు. పౌర సమాజాల భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు. జాతీయ మలేరియా నిర్మూలన కార్యాచరణ ప్రణాళిక (2016-2030)ను నడ్డా ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ 70 శాతం మలేరియా కేసులు, 69 మలేరియా మరణాలు దక్షిణ ఆసియా ప్రాంతంలోనే సంభవిస్తున్నాయని చెప్పారు. మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని విధాన నిర్ణయంగా పరిగణించి విజయవంతం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మంత్రి ఆదేశించారు. దేశంలో 80 శాతం మంది మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నారని ఆరోగ్య మంత్రి తెలిపారు. దేశంలో 200 జిల్లాల్లో మలేరియా ప్రభావం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పశ్చిమబెంగాల్, ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత ఉందని నడ్డా తెలిపారు. పొరుగునే ఉన్న నేపాల్, శ్రీలంకల్లో దశాబ్దాకాలంగా ఒక్క మలేరియా కేసు నమోదు కాలేదని మంత్రి గుర్తుచేశారు. ఇలావుండగా, నులిపురుగులు నివారణ ట్యాబ్లెట్ల వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్ ఉండదని నడ్డా స్పష్టం చేశారు. ఈ ట్యాబెట్లు వేసుకుని 200 మంది పిల్లలు అస్వస్థతులైన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఒకటి రెండు శాతం మంది పిల్లలు నీరసంగా కనిపించడం జరుగుతుందని అన్నారు. నులిపురుగులు ట్యాబెట్లు వేసుకున్న పిల్లలు బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్‌గఢ్‌లలో ఆసుపత్రులపాలయ్యారు. ట్యాబెట్లు వేసుకున్న పిల్లలు వాంతులు, తలతిప్పినట్టు ఉండడం జరిగింది.

న్యాయం జరిగేవరకు
పోరాటం ఆపేదిలేదు

రోహిత్ తల్లి రాధిక స్పష్టీకరణ

తిరువనంతపురం, ఫిబ్రవరి 11: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివక్షకు బలయిన తన కుమారుడు రోహిత్ వేములకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడుతూనే ఉంటానని రాధిక వేముల స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి తమ కుటుంబాన్ని పరామర్శించారని, అలాగే అనేక మంది నాయకులు వచ్చి ఓదార్చారని, కాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం నేటి వరకు స్పందించలేదని ఆమె అన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు రెండో కుమారుడు వేముల రాజుతో కలిసి తిరువనంతపురంకు వచ్చిన రాధిక గురువారం ఒక వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తన కుమారుడు రోహిత్‌కు వచ్చిన దుస్థితి మరెవరికీ రాకుండా చట్టం తీసుకురావాలని కోరారు. రోహిత్ మృతికి బాధ్యులయిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని సామాజిక న్యాయం జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో తాము పాల్గొంటున్నామని రాధిక రెండో కుమారుడు, ఎంఎస్సీ విద్యార్థి రాజు చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని హైజాక్ చేశాయని వచ్చిన వార్తల గురించి ప్రశ్నించగా, అది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల దుష్ప్రచారమని రాజు బదులిచ్చారు. ఇదిలా ఉండగా, కేరళ రాష్ట్ర మంత్రులు ఎం.కె.మునీర్, ఎపి అనిల్ కుమార్.. రాధికతో సమావేశమై ఆమె కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.