జాతీయ వార్తలు

రాష్ట్రాలకు గవర్నర్లే ఉత్ప్రేరకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అత్యంత అనుభవజ్ఞులైన గవర్నర్లు తమ రాష్ట్రం అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు టీం ఇండియాగా కలిసి పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ బుధవారం రాష్టప్రతి భవన్‌లో జరుగుతున్న 47వ గవర్నర్ల సదస్సులో ముగింపు ఉపన్యాసం ఇస్తూ ఈ పిలుపు ఇచ్చారు. రాష్ట్రాలలో గవర్నర్లది అత్యంత కీలకమైన ఉన్నత పదవి. వారికున్న ఎన్నో సంవత్సరాల అనుభవం ఆధారంగా వారు రాష్ట్భ్రావృద్ధికి ఉత్ప్రేరకాలుగా పని చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో జోక్యం చేసుకోకుండానే రాష్ట్భ్రావృద్ధికి కృషి చేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నా భారత దేశం ఒక్కటే ఆర్థికాభివృద్ధితో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచం ఇప్పుడు భారత దేశాన్ని గుర్తిస్తోందంటూ ఈ నేపథ్యంలో ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులను మన దేశం వౌనంగా చూస్తూ ఊరుకోవటం లేదని మోదీ చెప్పారు. డబ్లుటిఓ, సిఓపి 21 తదితర అంతర్జాతీయ వేదికల్లో భారత దేశం కీలక పాత్ర నిర్వహించిందని ప్రధాని చెప్పారు. సహకార ఫెడరలిజం ప్రాధాన్యతను ఆయన నొక్కి వక్కాణిస్తూ దీనిని తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు టీం ఇండియాగా కలిసి పని చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సహకార ఫెడరలిజం సహకార పోటీ ఫెడరలిజంగా రూపాంతరం చెందాలని ఆయన సూచించారు. రాష్ట్రాల అభివృద్ధికి ఇది ఆరోగ్యకరమైన పోటీగా మారాలని ప్రధానిహితవు చెప్పారు.

చిత్రం... ఢిల్లీలో బుధవారం గవర్నర్ల ముగింపు సదస్సులో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. వేదికపై రాష్టప్రతి, ఉప రాష్టప్రతి తదితరులు